close
Choose your channels

నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్ పాల్ కరోనాతో మృతి

Saturday, May 1, 2021 • తెలుగు Comments

నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్ పాల్ కరోనాతో మృతి

యావత్ భారతదేశాన్ని కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కేసుల సంఖ్యే కాదు.. మరణాల సంఖ్య సైతం భారీగానే ఉండటం గమనార్హం. దేశంలో నాలుగు లక్షలకు పై చిలుకు కేసులు.. లెక్కకు అందని మరణాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇక ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీలంతా కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నిన్న ఒక్కరోజే ఎన్నంటే..

తాజాగా బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు బిక్రమ్‌జీత్‌ కన్వర్‌ పాల్(52) కరోనాతో కన్నుమూశారు. తొలుత రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ అయిన బిక్రమ్‌ జీత్‌.. అనంతరం నటనను వృత్తిగా ఎంచుకున్నారు. 2003లో నటుడిగా బిక్రమ్ జీత్ తన జర్నీని ప్రారంభించారు. అప్పటి నుంచి పలు హిందీ చిత్రాలు, టీవీ సీరియల్స్‌, వెబ్‌ సిరీస్‌ల్లో నటుడిగా మెప్పించారు. బిక్రమ్‌జీత్‌ కన్వర్‌ పాల్ మృతిపై బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz