పిడి గుద్దుల్లాంటి పంచ్ లు.. వరుణ్ తేజ్ భీకరమైన బాక్సింగ్ పోరాటం!

  • IndiaGlitz, [Saturday,July 10 2021]

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న హై యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'గని' చివరి షెడ్యూల్ కి చేరుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుణ్ విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు.

ఆ పంథాలోనే కొనసాగుతూ బాక్సింగ్ నేపథ్యం ఉన్న ఈ చిత్రానికి అంగీకారం తెలిపాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి కావలసిన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం చివరి షెడ్యూల్ కు చేరుకుంది. ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ హై ఓల్టేజ్ బాక్సింగ్ యాక్షన్ ఎపిసోడ్ లో నటించబోతున్నాడు.

దీనికోసం ప్రత్యేకంగా బాక్సింగ్ కోర్టు సెట్ నిర్మించారు. ఈ పర్టికులర్ యాక్షన్ సీన్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ లెర్నల్ స్టోవెల్, వాల్డ్ రీయింబర్గ్ రంగంలోకి దిగారట. వీరు టైటాన్స్, సల్మాన్ ఖాన్ సుల్తాన్ లాంటి చిత్రాలకు పనిచేశారు. భీకరంగా సాగే ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని టాక్.

దబంగ్ 3 ఫేమ్ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ కి హీరోయిన్ గా నటిస్తోంది. సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చివరి షెడ్యూల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి థియేట్రికల్ రిలీజ్ చేయాలనేది ప్లాన్. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

గనితో పాటు వరుణ్ ప్రస్తుతం ఎఫ్3లో కూడా నటిస్తున్నాడు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

More News

ప్రభాస్ మెమొరబుల్ పోస్ట్.. ఇండియన్ సినిమా సరికొత్త అధ్యాయానికి 6 ఏళ్ళు!

బాహుబలి.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఎన్నో అనుమానాలు, సవాళ్లు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఇంత బడ్జెట్ లో తెరకెక్కించడం రిస్క్ కదా అని పెదవి విరిచినవారు లేకపోలేదు.

మోస్ట్ డేంజరస్ వుమెన్ అంటూ మెహ్రీన్ కామెంట్స్.. వైరల్!

అందాల తార మెహ్రీన్ కౌర్ ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది.

బాహుబలి 2, అవెంజర్స్ రికార్డ్ బ్రేక్.. ఫస్ట్ లుక్ రాకముందే సంచలనం

టాలీవుడ్, కోలీవుడ్ లలో తమ అభిమాన హీరోలని ఫ్యాన్స్ ఆరాధ్య దైవంలా భావిస్తారు. ఈ తరహా వైఖరి ఈ రెండు ఇండస్ట్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

'తిక్క' బ్యూటీ ట్వీట్.. వదిన వస్తోంది అన్నా అంటూ తేజుపై కామెంట్స్

2016లో సాయిధరమ్ తేజ్ నటించిన 'తిక్క' చిత్రం గుర్తుందిగా. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన చిత్రం అది.

ఒకటా, రెండా.. చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'కి పది బంపర్ ఆఫర్స్

ప్రేమ కథా చిత్రాలకు ఉండే డిమాండే వేరు. ఇక శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు తెరకెక్కించిన చిత్రం అయితే.. చైతు, సాయి పల్లవి జంటగా నటించి ఉంటే..