బతుకుతాననే ఆశ లేదంటూ పోస్టు పెట్టిన కాసేపటికే నటుడి మృతి..

  • IndiaGlitz, [Sunday,May 09 2021]

కరోనా మహమ్మారి జన జీవితాలను ఎంత విచ్ఛిన్నం చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఒక యంగ్ సెలబ్రిటీ కరోనా మహమ్మారి కారణంగా ఇక తను చనిపోబోతున్నానంటూ ఓ పోస్టు పెట్టి మరి కొద్ది క్షణాల్లోనే కన్నుమూసిన ఘటన నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది. మంచి వైద్యం అందక తను మరణించిన తీరు ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన నటుడు రాహుల్ వోహ్రా తనకు కూడా మంచి వైద్యం అందితే బతుకుతాను అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన కాసేపటికే తుదిశ్వాస విడిచాడు.

Also Read: సాయం కోరిన మెహర్ రమేష్.. 24 గంటల్లో అందించిన సోనూసూద్

‘‘నాకు కూడా మంచి చికిత్స అందితే నేను కూడా బతుకుతా. నా వయసు 35 ఏళ్లు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుపూర్, ఢిల్లీలో ఉన్నాను. మళ్లీ పుడితే మంచి పనులు చేస్తా. ఇప్పటికైతే బతుకుతానన్న ఆశ లేదు’’ అంటూ అతడు పెట్టిన పోస్ట్ హృదయాలను ద్రవింపజేస్తోంది. రాహుల్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని థియేటర్ డైరెక్టర్-ప్లేరైట్ అరవింద్ గౌర్ నేడు ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్లడించాడు. తనకు కరోనా సోకిందని ఫేస్‌బుక్ వేదికగా 5 రోజుల క్రితం రాహుల్ తెలియజేశాడు. తనకు ఆక్సిజన్ బెడ్ కావాలంటూ అర్థించాడు.

రాహుల్ ధైర్యం సన్నగిల్లుతోందంటూ నిన్న పోస్టు పెట్టాడు. చివరి నిమిషంలో మరో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాహుల్ మరణించాడని... మంచి నటుడిని కోల్పోయామని.. డాక్టర్ అరవింద్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. మంచి వైద్యం అందితే బతుకుతానని నిన్ననే తనతో చెప్పాడని... సాయంత్రం ద్వారకాలోని ఆయుష్మాన్‌కు తరలించామని వెల్లడించారు. కానీ అతడి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయామన్నారు. ‘మమ్మల్ని క్షమించు. మేమందరం దోషులమే’ అంటూ అరవింద్ తన ఫేస్‌బుక్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదు రోజుల క్రితం రాహుల్ ఫేస్‌బుక్ వేదికగా తనకు ఆక్సిజన్ బెడ్ కావాలని సాయం కోసం అర్థించాడు. ‘‘ఐదు రోజుల క్రితం నాకు కొవిడ్ సోకింది. ఆసుపత్రిలో చేరా. ఇప్పటికి దాదాపు ఐదు రోజులు అయింది. ఏమాత్రం కోలుకోలేదు. ఈ ఆసుపత్రి దుస్థితి ఇలా ఉంది. ఎక్కడైనా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్ లభిస్తుందా? ఎందుకంటే రోజురోజుకు నా ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయి. నా గురించి పట్టించుకునేవారు కూడా లేరు. కుటుంబ సభ్యులు కూడా ఇంతకుమించి ఏమీ చేయలేకపోతున్నారు. పూర్తిగా నిస్సహాయతతోనే ఈ పోస్టు చేయాల్సి వచ్చింది’’ అని రాహుల్ పెట్టాడు.

More News

`సింగ‌రాయ్` చిత్రంలోని సాయి ప‌ల్ల‌వి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రూపొందుతోన్న నేచుర‌ల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగ‌రాయ్` ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి.

ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. చైనా రాకెట్ ముప్పు తప్పింది!

అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంటే గత కొద్ది రోజులుగా కొత్త భయం ప్రారంభమైంది.

సాయం కోరిన మెహర్ రమేష్.. 24 గంటల్లో అందించిన సోనూసూద్

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది.

ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

జీ 5లో 'బట్టల రామస్వామి బయోపిక్కు' ఎక్స్‌క్లూజివ్‌ & డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్

వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు  సందడి చేస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక జీ 5.