close
Choose your channels

రెమ్యున‌రేష‌న్ విష‌యంలో హీరోయిన్ పెద్ద మ‌న‌సు

Tuesday, January 8, 2019 • తెలుగు Comments

రెమ్యున‌రేష‌న్ విష‌యంలో హీరోయిన్ పెద్ద మ‌న‌సు

సాధార‌ణంగా సినిమాలు డిజాస్ట‌ర్స్ అయిన‌ప్పుడు హీరోలు నిర్మాత‌ల‌కు రెమ్యున‌రేష‌న్స్ వెన‌క్కి ఇచ్చేయ‌డం చేస్తుంటారు. కానీ ఓ హీరోయిన్ త‌నకు ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి నిర్మాత వ‌స్తే వ‌ద్ద‌ని రెమ్యున‌రేష‌న్ తీసుకోలేదు. ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు..సాయిప‌ల్ల‌వి. ఆ సినిమాయే `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`. గ‌త డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యం పొందింది. 

నిర్మాత‌కు న‌ష్టం మిగిల్చిన విష‌యం తెలుసుకున్న సాయిప‌ల్ల‌వి, త‌న‌కు మిగిలి బ్యాలెన్స్ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి వ‌చ్చిన నిర్మాత చెరుకూరి సుధాక‌ర్ ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకోలేదు. ఆ మొత్తం దాదాపు న‌ల‌భై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌. హీరోయిన్ పెద్ద మ‌న‌సుకు ఆశ్చ‌ర్య‌పోవ‌డం నిర్మాత వంతైంది. 

Get Breaking News Alerts From IndiaGlitz