మేం ఏ తప్పు చేయలేదు.. థంబ్‌నెయిల్స్ చూసి పెట్టండి : చెక్‌బౌన్స్ కేసుపై జీవితా రాజశేఖర్ వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,April 23 2022]

గరుడ వేగ సినిమా నిర్మాణానికి సంబంధించి తమ వద్ద రుణం తీసుకుని ఎగవేశారంటూ జీవితా రాజశేఖర్ దంపతులపై జోస్టర్ ఫిలింస్ చేసిన ఆరోపణలు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారమే స్పందించిన జీవిత.. తమపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, శనివారం మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే జీవిత ప్రెస్‌మీట్ పెట్టారు.

దాదాపు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని, ఇప్పుడు వాళ్లు ప్రెస్‌మీట్‌ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని జీవిత వ్యాఖ్యానించారు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో నిజాలు లేవని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆమె పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే తనపై వారెంట్‌ వచ్చిందని.. కానీ తనకు ఎలాంటి సమన్లు అందలేదని జీవిత చెప్పారు. మా గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం ఎవరి తరం కాదని ఆమె స్పష్టం చేశారు. తన తప్పు వుంటే ఒప్పుకుంటానని, లేదంటే దేవుడ్ని కూడా ధైర్యంగా నిలదీస్తానని జీవిత అన్నారు.

తమ గురించి ఆరోపణలు చేసిన వాళ్లేమీ మహాత్ములు కాదన్న ఆమె... వాళ్ల వల్ల మా మేనేజర్‌ సహా ఎందరో ఇబ్బందులు పడ్డారని జీవితా రాజశేఖర్ ఆరోపించారు. విషయం కోర్టు పరిధిలో వున్నందు వల్ల తాను ఎక్కువగా మాట్లాడనని అన్నారు. ఈ కేసులో ఎంత వరకు వెళ్లడానికైనా సిద్ధమేనని జీవిత అన్నారు. మరోవైపు జోస్టర్ ఫిలింస్ చేసిన ఆరోపణలకు సంబంధించి యూట్యూబ్‌లో కొంతమంది క్రియేట్‌ చేస్తోన్న థంబ్‌నేల్స్‌ ‌పై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కోటేశ్వరరాజు, హేమల ప్రెస్‌మీట్‌ని అడ్డం పెట్టుకుని కొందరు ఏవేవో వీడియోలు క్రియేట్‌ చేసి ఇష్టం వచ్చినట్లు పెట్టారని జీవిత ఫైర్ అయ్యారు. ఇటీవల తమ కుమార్తెల గురించి, ఇటీవల నాగబాబు కుమార్తె నిహారికపై కూడా ఇలాగే యూట్యూబ్‌లో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇష్టం వచ్చినట్లు థంబ్‌నేల్స్‌ పెట్టి తమను ఇబ్బంది పెట్టొద్దని జీవిత మీడియాకు విజ్ఞప్తి చేశారు. మేము లేకుండా మీరు లేరని.. మీరు లేకుండా మేము లేమని ఆమె అన్నారు.

More News

హీరో క్యారెక్టరైజేషన్ చెప్పేస్తోన్న ‘‘సర్కార్ వారి పాట’’ టైటిల్ సాంగ్.. మీరూ ఓ లుక్కేయండి

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

ఘనంగా ప్రారంభమైన సొహైల్ 'లక్కీ లక్ష్మణ్‌'

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో

కేజీఎఫ్‌ పుట్టుక వెనుక... ఆ గజదొంగ స్పూర్తితోనే రాకీ బాయ్ క్యారెక్టర్ పుట్టిందా...?

కేజీఎఫ్ 2... ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే . కేజీఎఫ్ 1 విజయంతో వచ్చిన బజ్‌తో చాప్టర్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఫేర్‌వెల్ చేసుకుంటామని , వార్డెన్ ఇంటికెళ్లగానే... హాస్టల్‌లో పదో తరగతి విద్యార్ధుల సిట్టింగ్

సార్.. పరీక్షలు దగ్గర పడ్డాయి కదా.. ఫేర్ వెల్ పార్టీ చేసుకుంటాం సార్ అని పదోతరగతి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌ని కోరారు.

సీఎం కాన్వాయ్‌కి ప్రభుత్వ వాహనాలు లేవా... నేనేప్పుడూ చూడలేదు: ఒంగోలు ఘటనపై పవన్ ఆగ్రహం

ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబం నుంచి కారు లాక్కున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.