యూట్యూబర్‌ను వెంటాడి మరి చితక్కొట్టిన కరాటే కల్యాణ్.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్

  • IndiaGlitz, [Friday,May 13 2022]

కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరాటే కళ్యాణి. సినీ పరిశ్రమలోని ఇబ్బందులతో పాటు సామాజిక సమస్యలపైనా తన గళం వినిపిస్తూ వుంటారు. తాజాగా యూట్యూబ్‌లో ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డిపై ఆమె దాడి చేయడం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి కరాటే కళ్యాణి మరికొందరితో కలిసి యూసఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ రెడ్డిని వెంటాడి మరీ చితకబాదారు.

కాగా.. శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ గత కొన్నేళ్లుగా అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. అమ్మాయిలు, ఆంటీల దగ్గరకు వెళ్లి వారితో అసభ్యకరంగా మాట్లాడటం, వారిని టచ్ చేయడం వంటి ఫ్రాంక్ వీడియోలు చేస్తూ యూత్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే మహిళల్ని కించపరిచేలా ఆ వీడియోలు వుండటంతో శ్రీకాంత్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో వెళ్లి మరీ అతన్ని చితకబాదింది కళ్యాణి. దీంతో అతను కూడా తిరగబడ్డాడు. ఈ కొట్లాటలో కళ్యాణి తన బిడ్డతో సహా కిందపడిపోయింది. అయినప్పటికీ తేరుకుని అతనిని కొట్టింది.

అయితే తాను పెయిడ్ ఆర్టిస్ట్‌లకు డబ్బులిచ్చి ప్రాంక్ వీడియోలు తీస్తున్నానని.. ఇది నచ్చకపోతే తనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ కొట్టడం ఏంటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనతో వీడియో తీసుకోవడానికి డబ్బులు అడిగిందని.. అవి ఇవ్వకపోవడంతోనే ఇలా చేసిందని అతను ఆరోపిస్తున్నాడు. మరోవైపు కళ్యాణి మాత్రం ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. శ్రీకాంత్ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. తనతో పడుకోవాలని అడిగాడని, అంతేకాకుండా తన శరీరాన్ని తాకాడని అందుకే చెంప పగులగొట్టానని కరాటే కళ్యాణి చెబుతోంది. ఈ గొడవకు సంబంధించిన మొత్తం ఇష్యూని ఆమె ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. దాడి అనంతరం ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

More News

ఆటా స్పోర్ట్స్ ఈవెంట్‌కు అనూహ్య స్పందన.. ఇదే జోష్ కంటిన్యూ చేయాలన్న నిర్వాహకులు

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగు వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం పాటుపడుతున్న సంస్థల్లో ‘‘ఆటా’’ ముందు వరుసలో వుంది.

అమ్మకు వందనం.. ఆటా ఆధ్వర్యంలో ‘మదర్స్ డే’ వేడుకలు

వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరగనున్న ఆటా 17వ మహాసభలకు ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల,

శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ.. అనుమానంతో చెక్ చేస్తే, పోలీసుల అదుపులో టీటీడీ ఉద్యోగి

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపు సమయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూనే వున్నారు.

ఇంద్రకీలాద్రి : హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. వాష్‌రూంలో బంగారం, గుట్టువిప్పిన టాస్క్‌ఫోర్స్

విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహామండపంలోని ఆరో అంతస్థులో

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలింపు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.