Karthika Nair:గోల్డెన్‌ వీసా అందుకున్న నటి కార్తిక నాయర్‌

  • IndiaGlitz, [Monday,March 20 2023]

సీనియర్‌ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఎఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందింది. ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషించారు కార్తిక. కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి, యంగ్‌ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్‌ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్‌ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్‌ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక తన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీక నాయర్‌ అన్నారు.

కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్‌ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్‌ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే! కేరళలోనూ ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్‌ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు.

More News

Vairam:దేవరాజ్ తనయుడు హీరోగా 'వైరం' చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్

యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్,సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్

Railway Station:రైల్వే‌ ఫ్లాట్‌ ఫాం టీవీల్లో పోర్న్ వీడియోలు.. ఖంగుతిన్న ప్రయాణికులు, 3 నిమిషాల పాటు స్ట్రీమింగ్

సాధారణంగా రైల్వేస్టేషన్‌లలో అనౌన్స్‌మెంట్‌లు వచ్చే టీవీలు వుంటాయి. వాటిల్లో రైలు వచ్చే వివరాలతో పాటు కొన్ని వాణిజ్య ప్రకటలు వస్తూ వుంటాయి.

Amritpal Singh:100 కార్లతో వెంటాడినా పరార్, అమృత్‌పాల్ కోసం ముమ్మరవేట.. పంజాబ్‌లో ఏం జరుగుతోంది..?

అమృత్‌పాల్ సింగ్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌తో దశాబ్ధాలుగా వున్న ‘ఖలిస్తాన్’

Kalvkuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణ హాజరయ్యారు.

Ram Gopal Varma:‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?’ .. వీహెచ్‌పై సెటైర్లు వేసిన రామ్‌గోపాల్ వర్మ, ట్వీట్ వైరల్

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జోలికి ఎవరైనా వెళ్లడానికి భయపడతారు. వెళితే.. తమను తిరిగి ఏమంటారోనని వారికి భయం.