close
Choose your channels

Nidhi Agarwal : నిధి అగర్వాల్‌తో వేణు స్వామి పూజలు.. ఏంటీ సంగతి..?

Wednesday, March 29, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిత్ర పరిశ్రమ విచిత్రమైంది. మహాసముద్రం లాంటి ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ కాదు. టన్నులకొద్దీ టాలెంట్ వున్నా.. ఆవగింజంత అదృష్టం కూడా వుండాలి. అందుకే అతికొద్దిమంది మినహా ఇక్కడ స్టార్‌లుగా మారాలని వచ్చిన వారి అడ్రస్ గల్లంతే. ఇకపోతే.. సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఐదేళ్లు, లేదా మంచి హిట్లు పడితే ఇంకో రెండేళ్లు అంతేకానీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని హీరోయిన్ల మాదిరి దశాబ్ధాల తరబడి వెండితెరను ఏలడం కుదరని పని. కానీ ఈ తరంలోనూ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేదని నిరూపించారు. అనుష్క, నయనతార, శ్రియ, కాజల్ , త్రిష , తమన్నా వంటి వారు సుదీర్ఘకాలంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఎన్ని కొత్త అందాలు దూసుకొస్తున్నా... తమ నటనతోనూ ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు. కానీ అందరికీ వీరిలా స్టార్‌డమ్‌ను అనుభవించే అదృష్టం వుండదు. చాలా మంది ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. ఇప్పుడున్న హీరోయిన్ల పేర్లు చెప్పమంటే జనంఆకాశంలోకి చూస్తారంటూ అతిశయోక్తి కాదు.

నిధి అగర్వాల్‌తో వేణు స్వామి పూజలు :

ఇదిలావుండగా.. అందాల నటి నిధి అగర్వాల్‌తో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి పూజలు చేయించిన వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఈ ప్రక్రియ అంతా నిధి అగర్వాల్‌ మంచి అవకాశాలు అందుకోవడానికి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకేనని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిధి అగర్వాల్ ఇంట్లో వేణుస్వామి రాజశ్యామల పూజ చేయించినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ సినిమా తప్పించి మరో ఆఫర్ అందుకోనీ నిధి:

కాగా.. సవ్యసాచి సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు నిధి అగర్వాల్. అందం, అభినయం బాగానే వున్నప్పటికీ ఈ అమ్మడికి ఎందుకో కలిసి రావడం లేదు. తొలి సినిమానే నిరాశకు గురిచేసింది. ఆ వెంటనే మిస్టర్ మజ్నూ చేశారు అది కూడా ఫట్టే కావడంతో నిధి అగర్వాల్ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ - రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కావడంతో మంచి పేరే వచ్చింది. అటు తర్వాత తమిళంలో ఈశ్వరన్, భూమి వంటి సినిమాలు అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో కోలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. దీనికి తోడు హీరో శింబుతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందంటూ పుకార్లు వచ్చాయి. దీంతో తమిళనాట నిధి సెటిలైపోతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్- క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లులో ఆఫర్ కొట్టేసింది. ఇది తప్పించి చేతిలో మరో అవకాశం రాకపోవడంతో నిధి అగర్వాల్ భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె జాతకాన్ని పరిశీలించిన వేణుస్వామి కొన్ని పూజలు చేయించినట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై వీరిద్దరిలో ఒకరు క్లారిటీ ఇస్తేనే గానీ అసలు మ్యాటర్ ఏంటో తెలియదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.