close
Choose your channels

pooja hegde: పూజా హెగ్డే పట్ల ఇండిగో ఉద్యోగి అసభ్య ప్రవర్తన.. భయం వేసిందన్నబుట్టబొమ్మ

Thursday, June 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. సెలబ్రెటీలు, ప్రముఖులు, సామాన్య ప్రయాణీకులతో ఈ సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమో లేదంటే సరైన సేవలు అందించకపోవడమో జరిగిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఇండిగో బాధితురాలిగా మారారు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. విపుల్‌ నకాషే అనే ఇండిగో సంస్థ ఉద్యోగి తనతో అహంకారంగా, అజ్ఞానంతో మాట్లాడాడని, ఎలాంటి కారణం లేకుండానే వేధించాడని ఆమె ఆరోపించింది. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ట్వీట్‌ చేయనని కానీ ఈరోజు అతడి ప్రవర్తనతో చాలా భయమేసిందని పూజా హెగ్డే వాపోయింది. ముంబై నుంచి బయల్దేరిన విమానంలో ఈ సంఘటన జరిగినట్లు ఆమె తెలిపారు.

ఈ ట్వీట్ క్షణాల్లో సంచలనం సృష్టించింది. పూజా హెగ్డే అభిమానులు, నెటిజన్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తీరుపై మండిపడుతున్నారు. వివాదం పెద్దదవుతుండటంతో ఇండిగో యాజమాన్యం స్పందించింది. పూజా హెగ్డేపై క్షమాపణలు చెప్పడంతో పాటు వెంటనే చర్యలు తీసుకుంటామని.. పీఎన్ఆర్ నంబరు, కాంటాక్ట్ నంబరు మెసెజ్ చేయాలని కోరింది.

మంత్రి రోజా, తదితరులను గాల్లో తిప్పిన ఇండిగో:

అయితే కొద్దిరోజుల క్రితం సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమానం గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా మధ్యాహ్నం బెంగళూరులో ల్యాండ్‌ అయింది. సాంకేతిక సమస్యా, వాతావరణ సమస్యా అనేది చెప్పకపోవడంతో రెండు గంటల పాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. విమానంలో మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండిగో విమానం డోర్లు తెరుచుకోవడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజు.. ఇండిగోపై కేసువేస్తానని హెచ్చరించారు.

వీణ శ్రీవాణికి చేదు అనుభవం:

అలాగే ప్రముఖ సింగన్ వీణ శ్రీవాణికి సైతం ఇండిగో ఎయిర్‌లైన్స్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. లగేజీ కోసం తమ వద్ద నుంచి ఎక్స్‌ట్రా రుసుము వసూలు చేశారని.. కానీ గమ్యస్థానం చేరుకున్నా వారు తమ తమ బ్యాగ్‌లను, ఇతర సామాగ్రిని అందజేయలేదని శ్రీవాణి మండిపడ్డారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.