Samantha Health : సమంతకు తీవ్ర అస్వస్థత.. మేనేజర్ క్లారిటీ

  • IndiaGlitz, [Thursday,November 24 2022]

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు సమంత. అయినప్పటికీ మొక్కొవోని ఆత్మవిశ్వాసంతో వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. అంతేకాదు.. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇలా జీవితాన్ని లాగిస్తూ వుండగా సామ్ జీవితంలో మరో కుదుపు చోటు చేసుకుంది. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో సమంతా బాధపడుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని తొలుత పుకార్లుగా అంతా కొట్టిపారేశారు. కానీ స్వయంగా సమంత అది నిజమేనని ‘‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన తాను పడినట్లు ఆమె ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రపంచం షాక్‌కు గురైంది. యశోదా సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సామ్ కన్నీటి పర్యంతమయ్యారు.

ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా ‘‘గెట్ వెల్ సూన్ సామ్’’ :

మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే సమంత ఆరోగ్యంపై ఆన్‌లైన్‌లో గాలి వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని ఆ వార్తల్లో రాశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ సామ్ అనే హ్యాష్‌ ట్యాగ్ వైరల్ అయ్యింది. అలాగే సమంత సిబ్బందిని ట్యాగ్ చేస్తూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

ఆ వార్తలు నమ్మొద్దు:

వ్యవహారం శృతిమించడంతో సమంత మేనేజర్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. సమంత ఇంట్లోనే వున్నారని, ఆరోగ్యం కూడా బాగానే వుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో మాదిరిగానే జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారని మేనేజర్ వెల్లడించారు. సమంత ఆరోగ్యం గురించి వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని ఆయన సూచించారు.

More News

Priya Prakash Varrier : షార్ట్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్ హాట్ ట్రీట్... చూసినోళ్లకి పండగే..!!

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరు గురించి తెలియని వారుండరు.

BiggBoss: ఇవే తగ్గించుకుంటే మంచిది.. శ్రీసత్యకు పేరెంట్స్ హెచ్చరిక, నాకెవ్వరూ లేరంటూ కీర్తి కంటతడి

బిగ్‌బాస్‌లో సోమవారం నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత అంతా కెప్టెన్సీ టాస్క్ కోసం కుస్తీలు పడతారు.

Rashmi Gautam : మాల్దీవుల్లో మంట పుట్టిస్తోన్న రష్మీ గౌతమ్... షర్ట్ బటన్ విప్పేసి బ్రాతో ఫోజులు

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వుండగా.. ఒకరిద్దరు మాత్రమే స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు.

Sai Pallavi : రౌడీ బేబి సినిమాలపై నో అప్‌డేట్...సాయిపల్లవి సంచలన నిర్ణయం తీసుకున్నారా...?

ఇప్పటి రోజుల్లో హీరోయిన్లంటే స్కిన్ షో, హాట్ ఫోటో షూట్‌లు, అందాల అరబోతలు, లిప్ లాక్స్‌కే పరిమితమవుతున్నారు.

MLAs Poaching Case : రామచంద్ర భారతిపై మరో కేసు.. కర్ణాటక అడ్రస్‌తో నకిలీ పాస్‌పోర్ట్, ఆ ఫోన్‌లో కీలక విషయాలు

మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.