close
Choose your channels

ఆమె నా కూతురు కాదు, ఆస్తుల్ని కాజేసేందుకే ఈ ప్రచారం: ‘‘ పెళ్లి సందD ’’ హీరోయిన్ శ్రీలీలపై ఆరోపణలు

Monday, October 18, 2021 • తెలుగు Comments

ఆమె నా కూతురు కాదు, ఆస్తుల్ని కాజేసేందుకే ఈ ప్రచారం: ‘‘ పెళ్లి సందD ’’ హీరోయిన్ శ్రీలీలపై ఆరోపణలు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించిన చిత్రం ‘‘ పెళ్లి సందD ’’. ప్ర‌ముఖ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్, శ్రీ‌లీల జంట‌గా న‌టించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం. ఇక హీరోయిన్లను పరిచయం చేయడంలో రాఘవేంద్రరావుది అందె వేసిన చేయి. ఎంతోమంది ముద్దుగుమ్మలను తెలుగు తెరకు పరిచయం చేసారాయన.

ఆమె నా కూతురు కాదు, ఆస్తుల్ని కాజేసేందుకే ఈ ప్రచారం: ‘‘ పెళ్లి సందD ’’ హీరోయిన్ శ్రీలీలపై ఆరోపణలు

తాజాగా పెళ్లి సందDతో శ్రీలీల అనే అమ్మాయిని కూడా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేశారు రాఘవేంద్రరావు. ఈ సినిమా చూసిన తెలుగు జనాలు శ్రీలీల గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా రోమాంటిక్ సన్నివేశాల్లో ఈ అమ్మాయి నటన.. కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతోందట. ఈ నేపథ్యంలో శ్రీలీల భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందని కొందరు అంటున్నారు. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ... ప్రీ రిలీజ్ ఈవెంట్లో గలగలా మాట్లాడుతూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రేక్షకులని కూడా మెప్పించింది.

ఆమె నా కూతురు కాదు, ఆస్తుల్ని కాజేసేందుకే ఈ ప్రచారం: ‘‘ పెళ్లి సందD ’’ హీరోయిన్ శ్రీలీలపై ఆరోపణలు

ఈ క్రమంలో శ్రీలీల కొత్తగా వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన కుమార్తె అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు. ఈ విషయంపై ఆదివారం ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. శ్రీలీల తన కూతురు కాదని తేల్చిచెప్పారు. ఆమె తన మాజీ భార్య కూతురని శుభాకరరావు తెలిపారు. తాము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చిందని.. ఇప్పుడు తన ఆస్తులను క్లెయిమ్‌ చేయడానికి ఆమె తండ్రిగా నా పేరు వాడుతున్నారంటూ శుభాకరరావు ఆరోపించారు. ఈ విషయంలో లీగల్‌గా ముందుకెళ్తామని.. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. మరి ఈ వివాదంపై శ్రీలీల కానీ ఆమె తల్లి కానీ స్పందించాల్సి వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz