close
Choose your channels

మహేష్‌తో మళ్ళీ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని...

Friday, June 11, 2021 • తెలుగు Comments

మహేష్‌తో మళ్ళీ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని...

కృతి సనన్ గుర్తుందా? అదేనండీ... 'వన్ నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో, సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ బాలీవుడ్‌కి వెళ్ళింది. 'దోచేయ్' తరువాత తెలుగులో మరో సినిమా చెయ్యలేదు. ఇప్పుడు టాలీవుడ్ కంటే మహేష్ మీద మనసు మళ్ళినట్టు ఉంది. మహేష్‌తో మళ్ళీ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్తోంది.

రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాన్స్ అడిగిన క్వశ్చన్స్‌కు కృతి సనన్ ఆన్సర్స్ ఇచ్చింది. మహేష్ గురించి ఒక్క మాట చెప్పమని అడిగితే "బెస్ట్. నా ఫస్ట్ కో-స్టార్. అమేజింగ్ పర్సన్. చాలా వినయపూర్వకంగా ఉంటారు. ఆయనతో మళ్ళీ పని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని కృతి సనన్ చెప్పింది.

మహేష్‌తో మళ్ళీ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని...

ప్రజెంట్ ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీతగా కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని, వన్నాఫ్ ది మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అని కృతి సనన్ వివరించింది. దర్శకుడు ఓమ్ రౌత్‌ను త్వరగా షూటింగ్ స్టార్ట్ చెయ్యమని కోరింది.

Get Breaking News Alerts From IndiaGlitz