నవంబర్ 9 న అదిరింది రిలీజ్

  • IndiaGlitz, [Friday,November 03 2017]

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ట్రైలర్లకు కు అద్భుతమైన స్పందన లభించింది. తమిళం లో ఇటీవలే విడుదలై ఇప్పటికే దాదాపు 200 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తోంది. పలు రికార్డు ల లెక్కలు మార్చేసిన అదిరింది చిత్రాన్ని తెలుగు లో నవంబర్ 9 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించాడు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ… విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ 100 చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో నవంబర్ 9 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. తమిళ్ లో ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రాజా రాణి, తెరి వంటి కమర్షియల్ సూపర్ హిట్స్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచ‌నాలు భారీగా వున్నాయి. విజ‌య్ ఫెర్‌ఫార్మెన్స్ మ‌రో రేంజి లో చూడ‌బోతున్నారు. స‌మంత‌, కాజ‌ల్, నిత్యామీన‌న్ లు పోటాపోటీగా న‌టించారు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది.

More News

ప్రొడక్షన్ నెంబర్ 1 షూటింగ్ ప్రారంభం !!

రాకేందుమౌళి-కల్పిక జంటగా.. యువ ప్రతిభాశాలి హరీష్ కె.విని దర్శకుడిగా పరిచయం చేస్తూ..  మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై యువ నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్  ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం నవంబర్ 2న ప్రారంభమైంది.

'రాజా ది గ్రేట్' చిత్రానికి మరింత వినోదం జ‌త కానుంది...

అరె బుజ్జి..ప్రేక్ష‌కుల ముఖ చిత్రాలేంటి? ఆనందం..అమితానందంతో ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు..

సిద్దార్థ్ సినిమా వాయిదా ప‌డింది

శంక‌ర్ రూపొందించిన బాయ్స్ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు సిద్దార్థ్‌. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మ‌రిల్లు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన సిద్ధార్థ్‌.. ఆ త‌రువాత ఆ స్థాయి విజ‌యాల‌ను అందుకోలేక‌పోయాడు.

వాన విల్లు ట్రైలర్ లాంచ్

రాహుల్ ప్రేమ్( ఆర్ పి) మూవీ మేకర్స్ బ్యానర్ పై లంక  ప్రతీక్ ప్రేమ్ కరణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం వానవిల్లు. ఈ చిత్రానికి నిర్మాత లంక కరుణాకర్ దాస్ కాగా శ్రావ్య రావు, విశాఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అక్ర‌మ్ మూవీ టీజర్ రిలీజ్ ఫంక్ష‌న్

విజ‌య‌వాడ‌: న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అచ్చ తెలుగు నేల‌పై... హాలీవుడ్ త‌ర‌హాలో నిర్మిoచబడిన  సినిమా "అక్ర‌మ్". ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ విజ‌య‌వాడ‌లోని ఒక స్టార్ హోట‌ల్ లో ఘ‌నంగా జ‌రిగింది.