close
Choose your channels

Adipurush : సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్‌ .. ఎలాంటి సర్టిఫికెట్‌ వచ్చింది, రన్ టైమ్ అంత సేపా ..?

Thursday, June 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. భారతీయుల ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. జూన్ 16న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ సందర్భంగా ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్, ట్రైలర్‌ను మరిపించేలా ఈ ఫైనల్ ట్రైలర్‌ను కట్ చేశారు.

నేటితరానికి తగ్గట్లుగా రామాయణం:

స్వామిజీ రూపంలో వచ్చిన రావణుడికి భిక్ష వేసేందుకు గాను సీతా దేవి లక్ష్మణుడు గీసిన గీతను దాటి ముందుకు వస్తుంది. అప్పుడు రావణుడు ఆమెను అపహరించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సీతను వెతుక్కుంటూ రాముడు బయల్దేరడం, వానర సైన్యం, సీత వద్దకు ఆంజనేయుడు, చివరిలో రామ-రావణ యుద్ధం గురించి చెప్పుకుంటూ వెళ్లారు మేకర్స్. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ గూస్ బంప్స్ తెప్పించేవిలా వున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో భారతీయ చిత్రాల్లో రామాయణాన్ని చిత్రీకరించారు. అయితే నేటి తరానికి తగ్గట్లుగా ఆధునిక హంగులతో ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. టీజర్ నాడు జరిగిన తప్పును సరిదిద్దుకుని .. ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేర్పులు చేశారు మేకర్స్. ఇదిలావుండగా.. ఆదిపురుష్‌ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘క్లీన్ యూ’’ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే మొత్తం 179 నిమిషాల పాటు సినిమా డ్యూరేషన్ వుందట. అంటే ఆల్‌మెస్ట్ 3 గంటల సినిమా. మరి ఈ తరంలో ఇంత సేపు ప్రేక్షకులు కుర్చీలో కూర్చోగలుగుతారా .. ఇందుకు చిత్ర యూనిట్ ఏం చేసిందో తెలియాలంటే జూన్ 16 వరకు వెయిట్ చేయాల్సిందే.

దళితులకు నో ఎంట్ర అంటూ పోస్టర్ :

మరోవైపు.. ఆదిపురుష్ ప్రదర్శించబడే థియేటర్‌లలోకి దళితులకు ప్రవేశం లేదని ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో ధర్మం కోసం నిర్మించిన ఈ సినిమాని హిందువులు అందరు తప్పకుండా వీక్షించాలి’’ అని ఈ పోస్ట్ లో రాసి ఉంది. దీంతో దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ సినిమాను అడ్డుకుంటామని.. ఈ చర్య దళిత హక్కులకు భంగం కలిగించడమేనంటూ దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరుతామని ప్రకటించారు.

ఆదిపురుష్ అందరిదీ అన్న మూవీ యూనిట్ :

వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ హుటాహుటిన స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి వాటిని నమ్మొద్దని ప్రేక్షకులను చిత్ర యూనిట్ కోరింది. ‘‘ఆదిపురుష్‌’’ టీమ్‌ కుల, వర్ణ, మతం ఆధారంగా ఎలాంటి వివక్షను చూపకుండా సమానత్వం కోసం గట్టిగా నిలబడుతంది. ఈ చెడును ఎదురించే క్రమంలో మాకు మద్ధతుగా నిలవండి. ‘‘ఆదిపురుష్‌’’ ప్రతి భారతీయుడిది , చెడుపై మంచి గెలుస్తుందని’’ ప్రకటించింది మూవీ యూనిట్. అయితే ఆదిపురుష్‌కు వ్యతిరేకంగా ఈ దుష్ప్రచారం చేస్తోంది ఎవరు అన్నది మాత్రం తెలియాల్సి వుంది. పనిగట్టుకుని మరి ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోంది ఎవరో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.