అక్టోబర్ 2న 'ఆదిపురుష్' టీజర్ విడుదల వేడుక

  • IndiaGlitz, [Tuesday,September 27 2022]

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆదిపురుష్ టీజర్ పోస్టర్ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు.

అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.

More News

బిగ్‌బాస్‌లో ఏజ్ షేమింగ్ ప్రకంపనలు.. గీతూని పక్కకినెట్టి ఇనయా డామినేషన్

బిగ్‌బాస్ 6వ సీజన్ నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఎప్పటిలాగే సోమవారం నామినేషన్ల ప్రక్రియ వుండటంతో యథావిధిగా రచ్చ జరిగింది.

The Ghost : 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'.

Varalakshmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 'శబరి'  కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో

Swathimuthyam: 'స్వాతి ముత్యం' ట్రైలర్ విడుదల

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ,

BiggBoss: నేహా ఔట్... రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యానంటూ కామెంట్స్

ఆదివారం పూట ఎలిమినేషన్ రౌండ్ వచ్చిందంటే చాలు షాకివ్వడానికి బిగ్‌బాస్ రెడీగా వుంటాడు.