సుధీర్‌తో అదితి.. డౌట్‌లో ప‌డింది

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

జెంటిల్‌మాన్‌, అమీతుమీ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న యువ క‌థానాయ‌కుడు సుధీర్‌బాబుతో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించ‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి అదితి రావ్ హైద‌రీ హీరోయిన్‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ప్ర‌కారం.. అదితి విష‌యం డైలమాలో ఉంద‌ని తెలిసింది. ఈ సినిమాని బ‌డ్జెట్ కంట్రోల్ తో తీయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంద‌ట‌. అయితే అదితి మాత్రం కాస్త ఎక్కువ పారితోషికాన్నే డిమాండ్ చేస్తోంద‌ని.. ఆ విష‌యంలో క్లారిటీ వ‌చ్చాకే ఆమెని హీరోయిన్‌గా తీసుకోవాలా వ‌ద్దా అని టీమ్ డిసైడ్ అవుతుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఎక్కువ‌గా హిందీ చిత్రాల్లోనే న‌టిస్తూ వ‌స్తున్న అదితి.. ఇటీవ‌లే మ‌ణిర‌త్నం, కార్తీల త‌మిళ అనువాద చిత్రం చెలియాలో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. మ‌రి.. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిన అదితి.. ఆ ఆఫ‌ర్‌ని నిల‌బెట్టుకుంటుందో.. పారితోషికం విష‌యంలో బెట్టు చేసి పొగొట్టుకుంటుందో చూడాలి.

More News

ఒకే హీరోయిన్‌తో నాగ‌శౌర్య రెండు చిత్రాలు

ఊహ‌లు గుస‌గుస‌లాడే, క‌ళ్యాణ వైభోగ‌మే, జో  అచ్యుతానంద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

'భ‌ర‌త్ అను నేను' లోనూ అలాగే..

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ కోసం హీరోయిన్ పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

'దేవిశ్రీ ప్ర‌సాద్' ప్రీమియ‌ర్ షో

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

'జంధ్యాల రాసిన ప్రేమకథ' సెన్సార్ పూర్తి, 24న విడుదల

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జంధ్యాల రాసిన ప్రేమకథ'. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం.