క్రెడిట్ అంతా మణిరత్నంగారికే దక్కతుంది - అదితిరావు హైదరీ

  • IndiaGlitz, [Monday,April 03 2017]

కార్తీ, అదితిరావు హైద‌రీ జంట‌గా న‌టించిన ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ 'చెలియా'. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై మద్రాస్‌ టాకీస్‌ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అదితిరావు హైద‌రీ మాట్లాడుతూ.. మణిరత్నంగారితో పనిచేయడం ఓ కల నిజమైనట్లుగా భావిస్తున్నాను. అయినా ఛాలెంజింగ్స్‌ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. అలాంటి ఛాలెంజింగ్‌రోల్ చెలియాలో చేశాను.
మణిరత్నం వంటి దర్శకులతోపనిచేసేటప్పుడు ఆయన నటుడుకి ఇవ్వాల్సిన స్వేచ్చను, స్పేస్‌ను ఇచ్చి లిమిట్స్‌ను దాటి మ‌న అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఓ కొత్త క్యారెక్టర్‌ను మనకు మనముగా కనుగొనే అవకాశం ఏర్పడుతుంది. సుహాసినిగారు ఆడియో వేడుకలో చేసిన అప్రిసియేషన్‌ క్రెడిట్‌ అంతా మణిరత్నంగారికే చెందుతుంది. నేను సినిమాలో ఏదీ చేసినా ఆయన చలవే. మణిగారి దర్శకత్వంలో సినిమా చేశాననడం ఈరోజుకు కూడా కలలాగానే ఉంది. సంజయ్‌దత్‌గారితో భూమి సినిమా చేస్తున్నాను. అలాగే పద్మావతి మూవీలో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చిందీ హైద‌రాబాద్ బ్యూటీ.

More News

'చెలియా' వంటి ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ చేయడం పెద్ద ఛాలెంజ్ - కార్తీ

కార్తీ, అదితిరావు హైదరీ జంటగా దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో కార్తీతో ఇంటర్వ్యూ...

తమిళ నిర్మాతల మండిలిలో విశాల్ టీం హవా

నడిగర్ సంఘంలో తనదైన సత్తా చాటిన విశాల్ అండ్ టీం రీసెంట్గా జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించి జనరల్ సెక్రటరీగా ఎన్నికైన విశాల్ ఇప్పుడు నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్న 'లంక'

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక".

'శేఖరంగారి అబ్బాయ్ ' పాటలు విడుదల

అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో

కన్నడ రీమేక్ లో నిఖిల్...

వరుస విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా