close
Choose your channels

గుర్తుచేసుకున్న అదితి

Saturday, June 15, 2019 • తెలుగు Comments

గుర్తుచేసుకున్న అదితి

మ‌నం ఎక్క‌డి నుంచి వ‌చ్చామో గుర్తుపెట్టుకోవ‌డం చాలా గొప్ప విష‌యం. కానీ ఆ విష‌యాన్ని ఎంత మంది గుర్తుపెట్టుకుంటార‌నేది వేరే విష‌యం. తాను మాత్రం త‌న ప్ర‌తి అడుగునూ గుర్తుచేసుకుంటాన‌ని చాలా సార్లు చెప్పింది అదితిరావు హైద‌రీ.

తాజాగా ఆమె పెట్టిన పోస్టు ఆ విష‌యాన్ని గుర్తుచేస్తున్న‌ట్టే ఉంది. ``ఏడాది క్రితం తెలుగులో నా తొలి చిత్రం `స‌మ్మోహ‌నం` విడుద‌లైంది. నేను ఎలాంటి చిత్రంతో అయితే తెలుగులో అడుగుపెట్టాల‌నుకున్నానే ప‌ర్ఫెక్ట్ గా అలాంటి చిత్ర‌మే `సమ్మోహ‌నం`. సుధీర్‌బాబుతో క‌లిసి నేను న‌టించిన చిత్ర‌మిది. విడులై ఏడాది అయిందంటే న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేదు. మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు మ‌ళ్లీ `వి` చేస్తున్నాం. ఈ సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రిస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌గారు నా ఫేవ‌రేట్ డైర‌క్ట‌ర్‌`` అని చెప్పింది హైద‌రీ. 

Get Breaking News Alerts From IndiaGlitz