close
Choose your channels

'ఖాకి' చిత్రంతో నిర్మాణంలోనూ సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న ఆదిత్య మ్యూజిక్

Thursday, November 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెండు దశాబ్దాలుగా సినీ గీతాలను ప్రేక్షకులకు చేరవేసే ఆడియో సంస్థల్లో ఆగ్రగామిగా నిలిచిన ఆదిత్య మ్యూజిక్ తొలిసారి 'ఖాకి' చిత్రంతో నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఈ సక్సెస్తో నిర్మాతలుగా ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలకు మంచి ఆరంభం దొరికినట్టయ్యింది. ఈ మధ్య కాలంలో విడుదలైన పోలీస్ నేపథ్య చిత్రాల్లో 'ఖాకి' ది బెస్ట్ చిత్రమని సినిమాను చూసిన ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసింది.

విడుదలైన ఆట నుండే హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ను రాబడుతుంది 'ఖాకి'. ఈ సినిమా సక్సెస్ అందించిన ఊపుతో నిర్మాతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు మరిన్ని మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆదిత్య మ్యూజిక్ చిత్ర నిర్మాణ రంగంలోనూ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ అనే పేరుని తెచ్చుకుంటారనడంలో సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.