అడివిశేష్ , శివాని జంటగా ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,January 23 2018]

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానుంది. వెంక‌ట్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన '2 స్టేట్స్' చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. రాజ‌శేఖ‌ర్‌, జీవిత త‌న‌య శివాని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచయం అవుతున్నారు. బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్క‌నుంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత : ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం : వెంక‌ట్ రెడ్డి.