కోవిడ్ ఎఫెక్ట్ .. అడవి శేష్ ‘‘మేజర్’’ సినిమా విడుదల వాయిదా

  • IndiaGlitz, [Monday,January 24 2022]

కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్‌లు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూలు విధించడం, 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లకు అనుమతించడంతో సినిమాల విడుదలలపై ప్రభావం పడింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీనికి తోడు పలువురు హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు కోవిడ్ బారినపడ్డారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే రెండు, మూడు నెలల పాటు సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా అడవి శేష్ నటించిన ‘‘మేజర్’’ సినిమా విడుదల వాయిదా పడింది.

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ‘‘మేజర్’’ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో మేజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మురళి శర్మ, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఫిబ్రవరి 11న ‘‘ మేజర్ ’’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో కోవిడ్ కారణంగా నెలకొన్న పరిస్ధితుల కారణంగా రిలీజ్‌పై చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. దేశం కోసమే ఈ సినిమాను సిద్ధం చేస్తున్నామని.. కాబట్టి పరిస్థితులు అనుకూలించినప్పుడే విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

More News

రంగ రంగ వైభవంగా టీజర్ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌కి ‘‘బటర్ ఫ్లై కిస్’’.. ఇచ్చిన కేతికా శర్మ

'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్.

హాట్ యాంకర్ శ్రీముఖిపై అభిమానం .. ఆమె పేరు టాటూగా వేయించుకున్న ఫ్యాన్

మనదేశంలో హీరో, హీరోయిన్లకు వున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ తారలను దైవంలా పూజిస్తూ..

లక్ అనేది - లేదు... మన రాత - మనమే రాసుకోవాలి : స్పూర్తి నింపేలా 'గుడ్ లక్ సఖి'

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు కీర్తిసురేష్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు…

ప్రముఖ జ్యోతిష్యులు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూత

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు.

'అనుపమ చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా '.. సస్పెన్స్ పెంచేస్తోన్న భామా క‌లాపం టీజర్‌

2003లో ఎవరే అతగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రియమణి. తర్వాత 'పెళ్లైన కొత్తలో' , 'యమదొంగ', రగడ, గోలిమార్ తదితర సినిమాలతో