close
Choose your channels

చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో....

Monday, September 10, 2018 • తెలుగు Comments

చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో....

సూప‌ర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లో కూడా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు. విల‌క్ష‌ణ‌మైన విల‌నిజంతో మెప్పించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. వివ‌రాల్లోకెళ్తే..  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో విల‌న్‌గా సోనూసూద్ న‌టిస్తున్నారు. అది కూడా రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో. `తేజ క‌థ‌ను నెరేట్ చేసిన త‌ర్వాత వ‌ద్దు అన‌డానికి నాకు న‌చ్చ‌లేదు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌ని ఓ డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను` అన్నారు సోనూసూద్‌. మ‌ణిక‌ర్ణిక సినిమా నుండి అర్ధాంత‌రంగా త‌ప్పుకున్న ఈయ‌న బాలీవుడ్ పి.వి.సింధు బ‌యోపిక్‌లో కూడా న‌టించ‌బోతున్నారు.