ఇప్పుడు బాలయ్యతో., రేపు సందీప్ కిషన్ తో..

  • IndiaGlitz, [Sunday,June 11 2017]

మూడు ప‌దులు దాటినా వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో వ‌రుస సినిమాల‌ను అంది పుచ్చుకుంటున్న ఢిల్లీ సుంద‌రాంగి శ్రియా శ‌ర‌న్‌. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణతో పైసా వసూల్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమా కాగానే తెలుగు, త‌మిళంలో డి16 ఫేమ్ కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న 'నాగాసుర‌న్‌' సినిమాలో న‌టించ‌బోతుంది. ఈ సినిమాలో సందీప్‌కిష‌న్‌తో పాటు అర‌వింద స్వామి కూడా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా న‌గ‌రం(త‌మిళంలో మా న‌గ‌రం) సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా మారుతున్నాడు. సందీప్ కిష‌న్‌, కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

ఇది కాకుండా మంజుల ద‌ర్శ‌క‌త్వంలో త్రిదాచౌద‌రి, అమైరా ద‌స్త‌ర్‌ల‌తో ఓ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాలు కాకుండా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు కునాల్ కోహ్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాలు కాకుండా తెలుగు, త‌మిళంలో రూపొంద‌నున్న ఓ చిత్రంలో న‌టించ‌డానికి రీసెంట్‌గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు ఈ సినిమాలో ముందుగా హీరోగా నాగ‌చైత‌న్య‌ను అనుకున్నారు. చైత‌న్య కూడా ముందుగా సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించిన ముందు ఉన్న క‌మిట్ మెంట్స్ కార‌ణంగా డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేనని త‌ప్పుకున్నాడ‌ట చైతు. దీంతో ద‌ర్శ‌కుడు కార్తీక్ న‌రేన్ సందీప్ కిష‌న్‌ను క‌లిసి క‌థ వినిపించ‌గా, సందీప్ సినిమాలో న‌టించ‌డానికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌.

More News

జూలైలో విక్రమ్ సీక్వెల్ స్టార్ట్...

డిఫరెంట్ కథలు,కాన్సెప్ట్ లు,గెటప్ లతో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న చియాన్ విక్రమ్,

రజనీ భార్య పాత్రలో...

తెలుగు హీరోలకు అమ్మ పాత్రలో మెప్పిస్తున్న ఈశ్వరీ రావు అందరికీ గుర్తుండే ఉంటుంది.

15 దియోటర్స్ లో 30రోజులు పూర్తిచేసుకున్న 'వెంకటాపురం'

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ &తుము ఫణి కుమార్ నిర్మాతలుగా

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దాసరి సంస్మరణ సభ!!

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం ఫెడరెషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కల్యాణ్ అధ్యక్షతన శనివారం సాయంత్రం హైదరాబాద్ రామానాయుడు కళా మండపంలో దర్శకరత్న దాసరి నారాయణరావు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.

సందీప్ కు సూర్య సపోర్ట్...

తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తున్న హీరోల్లో