నిన్న చిరు.. నేడు మ‌హేష్‌.. రేపు తార‌క్‌

  • IndiaGlitz, [Sunday,June 10 2018]

త‌మ కుటుంబ స‌భ్యుల ఆడియో వేడుక‌ల‌కి, ముంద‌స్తు విడుద‌ల వేడుక‌కు.. అదే కుటుంబానికి చెందిన స్టార్స్ రావ‌డం కొత్తేమీ కాదు. అయితే.. వ‌రుస‌గా మూడు రోజుల పాటు వేర్వేరు సినిమాల‌కు సంబంధించి వేడుక‌లు జ‌రగ‌డం.. వాటికి స్టార్ హీరోలు అతిథులుగా రావ‌డం అరుదైన విష‌య‌మే.

అలాంటి అరుదైన విష‌య‌మే ఇప్పుడు చోటుచేసుకుంటోంది. శ‌నివారం జ‌రిగిన తేజ్ ఐ ల‌వ్ యు ఆడియో ఫంక్ష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజ‌రై.. త‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌ను ఆశీర్వ‌దించారు. ఇక ఆదివారం జ‌రుగుతున్న స‌మ్మోహ‌నం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త‌న బావ సుధీర్ బాబు కోసం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సందడి చేయ‌నున్నారు.

అలాగే.. రేపు (సోమ‌వారం) జ‌ర‌గనున్న నా నువ్వే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో త‌న అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సంద‌డి చేయ‌బోతున్నారు. మొత్తానికి.. ఆయా కుటుంబ అభిమానుల‌కు ఇది ఆనందాన్నిచ్చే విష‌య‌మే

More News

మనం సైతం సేవా కార్యక్రమాలు నన్ను కదిలించాయి - నాని

మనం సైతం సేవా కార్యక్రమాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ సేవా సంస్థ అందిస్తున్న సహాయం మనసును కదిలించిందని ఆయన అన్నారు.

90 రోజుల్లో మ‌ల్టీస్టార‌ర్ పూర్తి

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌,  యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ కాంబినేష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు  ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని నిర్మిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. 

రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ అప్‌డేట్‌

రంగ‌స్థ‌లంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్ర‌లో కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్

'తేజ్ ఐ ల‌వ్ యు' చిత్రం తొలి ప్రేమ అంతా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను - చిరంజీవి

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం.

మ‌రోసారి మూడేళ్ళ గ్యాప్‌తో రాజ‌మౌళి

ఏడాదికో సినిమా.. లేదంటే రెండేళ్ళ‌కో సినిమా.. అన్న‌ట్లుగా కెరీర్ ఆరంభంలో త‌న సినిమాల‌తో ప‌ల‌క‌రించేవారు ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి.