పూరీ తర్వాత శ్రీనువైట్లనే

  • IndiaGlitz, [Friday,September 01 2017]

'బెంగాల్ టైగ‌ర్' త‌రువాత ఏడాదికిపైగా విరామం తీసుకున్న ర‌వితేజ‌.. ఇప్పుడు వ‌రుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న 'రాజా ది గ్రేట్' దీపావ‌ళికి రిలీజ్ అవుతుంటే..ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న మ‌రో చిత్రం 'ట‌చ్ చేసి చూడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. వీటితో పాటు త‌మిళ హిట్ చిత్రం 'బోగ‌న్' రీమేక్ లోనూ న‌టించేందుకు ర‌వితేజ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. త‌న‌కు క‌లిసొచ్చిన అగ్ర ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్లతోనూ ఓ సినిమా చేసేందుకు ర‌వితేజ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని స‌మాచార‌మ్‌.

'నీకోసం, వెంకీ, దుబాయ్ శీను' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో రానున్న సినిమా ఇదే. హీరోగా ర‌వితేజ ఎక్కువ‌గా న‌టించింది పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రాల్లోనే. ఈ ఇద్ద‌రి కల‌యిక‌లో 'ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, ఇడియ‌ట్‌, అమ్మ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మ‌నుషులు'.. ఇలా ఐదు సినిమాలు వ‌చ్చాయి. ఆ త‌రువాత స్థానం శ్రీ‌నువైట్లదే కావ‌డం గ‌మ‌నార్హం. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌టి మూడు సినిమాలు హిట్ట‌య్యాయి. నాలుగోసినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. మ‌రి శ్రీ‌నువైట్ల కూడా అదే బాట‌లో వెళ‌తాడో లేదంటే నాలుగో సినిమాతో హిట్ కొడ‌తాడో చూడాలి.

More News

పిజ్జా - 2 విడుదలకు రెడీ

డీవీ సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మాత డి.వెంకటేష్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం పిజ్జా-2.

ఐదేళ్ల తరువాత.. సమంత..

సమంత గత చిత్రం 'జనతా గ్యారేజ్'విడుదలై సంవత్సరం అవుతోంది.

'పెళ్లి రోజు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్

'పెళ్లి రోజు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా...

'వైశాఖం' బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అయినందుకు సంతృప్తిగా వుంది - సంగీత దర్శకుడు డి.జె. వసంత్

ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన డి.జె.వసంత్ 2012 'సుడిగాడు'చిత్రంతో

ఈ సారీ కూడా వదలడం లేదు

'అల్లుడు శీను','జయజానకి నాయక'చిత్రాలతో మాస్ కథానాయకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు