పుల్వామా ఘటన మరువక ముందే మరో దారుణం

  • IndiaGlitz, [Saturday,February 16 2019]

పుల్వామా ఉగ్రదాడి ఘటన మరువక ముందే ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయాయి. దొంగ దెబ్బ తీసిన ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి వ్యూహాలు రచిస్తున్న భారత్ జవాన్లు త్వరలోనే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌‌కు చేయాలని‌ దాదాపు సిద్ధమైపోయారు!. ఇందుకు కారణం ప్రధాని మోదీ.. జవాన్లకు తగు స్వేచ్ఛ ఇవ్వడమే. అయితే ఇలా పుల్వామా ప్రతీకారాన్ని తీర్చుకుందామనకుంటున్న సమయంలో దారుణం చోటుచేసుకుంది. జమ్ముకశ్మీర్‌‌లోని రాజౌరీ జిల్లా నౌషెరాలో శనివారం సాయంత్రం మేజర్ ర్యాంక్ అధికారిపై మదుపాతరలు పెట్టారు. ఈ ఘటనలో మేజర్ అమరుడయ్యారు. ఎలోవోసి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో మందుపాతరపెట్టిన ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయారు.

వివరాల్లోకెళితే.. పుల్వామా ఘటనాంతరం నిఘా పటిష్టం చేసిన భద్రతా బలాగాలు.. ఉగ్రవాదులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసే పనిలో జవాన్లు బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎలోవోసీ దగ్గర్లోని నౌషెరా వద్ద మందుపాతర వెలికితీస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆర్మీ మేజర్‌‌ స్థాయి ర్యాంక్ అధికారి అమరుడయ్యారు. కాగా ఈ ఘటనతో మరోసారి జమ్ముకశ్మీర్ ప్రాంతంలో అలజడి రేగింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇవాళ మందుపాతర పేలిన ప్రదేశంలోనే జనవరి 11న ఎల్ఈడీ బ్లాస్ట్‌‌లో ఇద్దరు అధికారులు తుదిశ్వాస విడిచారు.

More News

మీ గ‌డ‌ప‌ల‌కు పసుపునై బ్ర‌త‌కడానికి వ‌చ్చాను

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్‌గా రూపొందించారు. అందులో ఆయ‌న సినీ జీవితాన్ని 'య‌న్.టి.ఆర్ క‌థానాయ‌కుడు'గా జ‌న‌వ‌రి 9న  విడుద‌ల చేశారు.

ర‌ష్మీ బూతులు

గురువారం శ్రీన‌గ‌ర్ పుల్వామాలో భార‌త ద‌ళాల‌పై జ‌రిగిన తీవ్ర‌వాద దాడుల్లో 40 మంది జ‌వాన్లు ప్రాణాలు విడిచారు.

'మ‌న్మ‌థుడు' కోసం ఇద్దరు....

అక్కినేని నాగార్జున ఇప్పుడు రెండు సీక్వెల్స్‌ను సెట్స్‌కు తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. వాటిలో ముందుగా 'మ‌న్మ‌థుడు' సీక్వెల్ 'మ‌న్మ‌థుడు 2', 'సొగ్గాడే చిన్నినాయ‌నా' సీక్వెల్ 'బంగార్రాజు'.

కబాలి'కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఆసియా

ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌ను యావత్ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.

వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్.. అంతా మీ ఇష్టమే

వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే.