నిన్న సుజనా.. నేడు రాయపాటి.. రేపెవరో!?

  • IndiaGlitz, [Friday,February 21 2020]

ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలందరి పరిస్థితి ఇప్పుడు అదెదో సామెతలాగా తయారైంది. టీడీపీకి ఆర్థికంగా పెద్ద దిక్కుగా అండగా ఉన్నవారిలో ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులు మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఒకప్పుడు వాళ్లకు సంబంధించిన సంస్థలు, వ్యాపారాల విషయాల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కట్టకపోవడంతో ఇప్పుడు అనుభవిస్తు్న్నారట. అదేనండి.. సుజనా గ్రూప్‌కు సంబంధించి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా సదరు కంపెనీకి చెందిన ఆస్తులను వేలం ప్రకటన వేస్తున్నట్లు పేపేర్‌లో పేద్ద ప్రకటన చేసిన విషయం విదితమే. అయితే ఆ ప్రకటన వచ్చిన 24 గంటలు ముగియక మునుపే టీడీపీ ఉద్ధండుడైన రాయపాటికి సంబంధించిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. ఇంతకీ ఇద్దరి వ్యవహారమేంటో కాస్త లోతుల్లోకి వెళ్లి చూద్దాం.

సుజనా గ్రూప్స్ పరిస్థితి ఇదీ..!
వాస్తవానికి బ్యాంకులకు సంబంధించిన ఇబ్బందులు, సీబీఐ-ఈడీ కేసుల వ్యవహారాల నుంచి తప్పించుకోవడానికే సుజనా చౌదరీ టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తునే ఆరోపణలు వచ్చాయ్. అయితే సుజనా అనుకున్నదే నిజమైతే.. ఇప్పుడు అందుకు పూర్తిగా విరుద్దంగా సీన్ మొత్తం రివర్స్ అయ్యినట్లు పరిస్థితులు నెలకొన్నాయి. మొదట్నుంచి ఇలాంటి వాటికి స్పందిస్తూ.. కచ్చితంగా జరిగేవి జరిగి తీరుతాయని కోర్టులు, బ్యాంకుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు చెప్పినట్లుగానే జరిగింది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణ బకాయిలను చెల్లించనందున, ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయడంతో పాటు ఆ కంపెనీకి రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రకటనలో సుజనా చౌదరి, వై.శివలింగ ప్రసాద్ (లేట్), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ. ఎస్టీ ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ సంస్థల పేర్లను బ్యాంక్ ప్రకటించించింది.

తాజాగా రాయపాటి..!
రాయపాటికి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ పత్రికా ప్రకటన జారీచేసింది. వచ్చే నెల అనగా మార్చి-23న ఆ ఆస్తుల వేలం ఉండనుంది. రూ.837.37 కోట్ల విలువైన రుణం బకాయి పడటంతో గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23న వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ ప్రకటనలో స్పష్టం చేసింది. గుంటూరు 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న వాణిజ్య భవనం.. న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది. కాగా.. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ.16.44 కోట్లుగాను, ఢిల్లీలోని ఫ్లాట్‌ విలువను రూ.1.09 కోట్లుగా బ్యాంక్ నిర్ధారించింది.

రేపెవరో..!?
ఇదీ సుజనా, రాయపాటీల పరిస్థితి. సుజనా ఇవన్నీ బాధలుంటాయని ముందుగానే ఊహించి బీజేపీలో చేరినప్పటికీ తప్పకపోగా.. రాయపాటి మాత్రం బీజేపీలో చేరక ముందే పరిస్థితులు ఇలా ఉన్నాయ్. నిన్న సుజనా.. ఇవాళ రాయపాటి.. మరి రేపెవరో.. ఆ వ్యక్తి సీఎం రమేష్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదమో.. అంటూ నిపుణులు, రాజకీయ విశ్లేషకుల మాట. వాస్తవానికి రమేశ్ మీద కూడా గతంలో ఆరోపణలు రాగా.. ఆయనకు సంబంధించిన కంపెనీలపై సీబీఐ సోదాలు కూడా జరిగినా సంగతి తెలిసిందే. అయినా.. ఏ నిమిషానికి ఏమి జరుగునో.. అలా జరిపించోళ్లకు తప్ప మరెవరికి తెలుసు!

More News

దేవాన్ష్‌కు ప్రేమతో.. బాలయ్య భారీ గిఫ్ట్!

తండ్రి కొడుక్కు, తాతగారు మనవడికి.. నానమ్మ మనవడికి గిఫ్ట్ రూపేణా లేదా భూముల రూపేణా ముఖ్యమైన సందర్భాల్లో గిఫ్ట్‌లుగా ఇస్తుంటారన్న విషయం తెలిసిందే.

ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న కల్వకుంట్ల కవిత!

అవును మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు..?

హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టిన నిర్మాత‌... షాకిచ్చిన హీరోయిన్‌?

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా వ‌ర‌కు స‌మ‌న్వ‌యంతో పనులు జ‌రుగుతుంటాయి. ఎవ‌రినీ ఎవ‌రూ ఇబ్బంది పెట్టాల‌ని చూసిన ఎక్క‌డో ఓ చోట దెబ్బ త‌గిలేస్తుంది.

బోయపాటిపై కన్నెర్రజేసిన బాలయ్య.. ఎందుకంటే..!?

నంద‌మూరి బాల‌కృష్ణ, బోయపాటి కాంబినేష‌న్‌లో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల త‌ర్వాత మ‌రో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

హీరో ధ‌నుష్ త‌ల న‌ర‌కుతా అంటూ బెదిరింపులు

`అసుర‌న్` సినిమాతో గ‌త ఏడాది స‌క్సెస్ అందుకున్న హీరో ధ‌నుష్ ఇప్పుడు `క‌ర్ణ‌న్` అనే సినిమాలో న‌టిస్తున్నాడు.