హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్.. భయపడాల్సిందేమీ లేదన్న కేసీఆర్

  • IndiaGlitz, [Sunday,June 28 2020]

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌కు సమయం ఆసన్నమైంది. రోజు రోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆపై అవసరమనుకుంటే కేబినెట్‌ను సమావేశపరిచి లాక్‌డౌన్ విధిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నదని... అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువేనన్నారు. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదన్నారు. పాజిటివ్‌గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా.. ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని ఆమె పేర్కొన్నారు.

More News

'స‌రిగ‌మగ‌మ' లిరిక‌ల్ సాంగ్‌తో ఆకట్టుకుంటోన్నరాజ్‌ తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ను కెలుకుతున్న వ‌ర్మ‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను, అత‌ని అభిమానుల‌ను వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌కు ప‌బ్లిసిటీ కావాల్సిన‌ప్పుడల్లా కెలుకుతుంటాడు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలకు బ్రేకేసిన కరోనా

ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయమై గతంలో చర్చలు నడిచాయి.

ప్రమాదం అంచున డయాబెటిస్ రోగులు..

ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే కరోనా నుంచి బయటపడటం చాలా కష్టమని వైద్యులు వెల్లడిస్తూనే ఉన్నారు.

కరోనా లిస్టులో కొత్తగా మరో మూడు లక్షణాలు

కరోనా కేసులతో పాటు లక్షణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా లక్షణాల లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరో మూడు లక్షణాలను చేర్చింది.