మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు.. అవాక్కయిన జనం, ఎక్కడంటే..?

  • IndiaGlitz, [Wednesday,May 31 2023]

అఘోరాలు.. వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో వీరికి ప్రత్యేక స్థానం, గుర్తింపు వుంది. కుటుంబాన్ని , సంసార బాధ్యతలను వదిలేసి పరమేశ్వరుడి సేవకే వీరు జీవితాన్ని అంకితం చేస్తారు. ఒళ్లంతా విబూది పూసుకుని , స్మశానాల్లో శవాలను పీక్కుంటూ తిరిగే వీరిని చూస్తూ వెన్నులో వణకుపుట్టడం ఖాయం. ఉత్తర భారతదేశంలో కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించిన వారికి ఈ అఘోరాలను ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. ఇక అఘోరాల కథలతో వచ్చే సినిమాలన్నీ సూపర్‌హిట్టే. ఇండియాలో వాళ్లకి అంతటి క్రేజ్ వుంటుంది.

భార్యతో గొడవలు.. భర్త ఆత్మహత్య :

ఇదిలావుండగా.. తమిళనాడులోని ఓ వూరిలో చనిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చిన అఘోరా, మృతదేహంపై కూర్చొని పూజలు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా సూలూర్ సమీపంలోని కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్‌‌కు అతని భార్యతో నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదివారం భార్యాభర్తలు మరోసారి గొడవ పడగా.. మణికంఠన్ తీవ్ర మనస్తానికి గురయ్యాడు. ఇక ఈ లోకంలో తానుండలేనంటూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు , సన్నిహితులు మణికంఠన్ మృతదేహానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

తిరుచ్చి నుంచి వచ్చిన అఘోరా :

అయితే అతనికి తిరుచ్చిలో చిన్ననాటి మిత్రుడు ఒకడు వుండేవాడు. మణికంఠన్ మరణించిన విషయం తెలుసుకున్న అతను సూలూర్ వచ్చాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. ప్రస్తుతం అఘోరాగా వుంటున్న సదరు మిత్రుడు.. ఒంటి నిండా విభూదితో రౌద్రంగా మణికంఠన్ ఇంటికి వచ్చాడు. అంతేకాదు మృతదేహం మీద కూర్చొని మంత్రాలు చదువుతూ ఏవేవో పూజలు చేశాడు. దీంతో విషయం ఆ నోటా ఈ నోటా వైరల్ అయ్యింది. ప్రస్తుతం తమిళనాడులో ఎక్కడ చూసినా ఈ అఘోరా గురించే చర్చించుకుంటున్నారు.

More News

Pushpa 2: పుష్ప 2 యూనిట్‌తో వస్తున్న బస్సుకు ప్రమాదం.. ఆర్టిస్టులకు గాయాలు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి.

అల్లు అర్జున్ ఏషియన్ సత్యం థియేటర్ ఓపెనింగ్ డేట్స్ ఫిక్స్.. శ్రీరాముడి ఆశీర్వాదాలతోనే..?

తమ ముందు తరాల వారిని చూశారో.. లేక వ్యక్తిగత అనుభవమో కానీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

Avinash Reddy:అవినాష్ రెడ్డికి ఉపశమనం .. పచ్చ మీడియా కడుపు మంట, లైవ్ డిబేట్‌లో ఏకంగా జడ్జిలపైనే ఆరోపణలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

Srikanth Addala:మాస్ కథతో శ్రీకాంత్ అడ్డాల .. పేరు ‘‘పెద్ద కాపు’’, రక్తం మరకలతో ఆ చేతుల వెనుక కథేంటీ..?

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు వంటి అంశాల చుట్టూ సినిమాలు తీయడంలో

Kodali Nani:ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద అభిమానుల ఓవరాక్షన్ .. తారక్ ప్లేస్‌లో నేనుంటేనా : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు నిన్న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా