'అజ్ఞాతవాసి' టీజర్ వచ్చేసింది...

  • IndiaGlitz, [Saturday,December 16 2017]

ఎప్పుడెప్పుడా అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న 'అజ్ఞాత‌వాసి' టీజ‌ర్ వ‌చ్చేసింది. దాదాపు ఒక నిమిషం పాటు సాగిన ఈ టీజ‌ర్ వార‌ణాసి లొకేష‌న్‌తో ప్రారంభ‌మవుతుంది. మ‌ధురా మ‌ధుసూద‌నా..అంటూ కృష్ణుడి వ‌చ్చే పాట‌తో ఆసాంతం సాగింది. ఈ సాంగ్ వ‌చ్చేంత సేపు ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్స్‌తో చేసిన ఎక్స్ ప్రెష‌న్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌న్నీ చూపించారు. టీజ‌ర్ చివ‌ర మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ మైగాడ్ అనే డైలాగ్ చెప్పాడు. 'వీడి చ‌ర్య‌లు ఊహ‌తీతం, వ‌ర్ణ‌నార‌హితం' అని ముర‌ళీశ‌ర్మ అంటే 'ద‌ట్స్ ద బ్యూటీ' అని రావ్ ర‌మేష్ చెప్ప‌డంతో టీజ‌ర్ ముగుస్తుంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా స్టైలిష్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నాడు. అలాగే ప్ర‌తి స‌న్నివేశం చాలా రిచ్‌గా క‌న‌ప‌డుతుంది. టీజ‌ర్‌లో ప‌న‌వ్‌క‌ల్యాణ్‌తో పాటు రావ్ ర‌మేష్‌, బొమ‌న్ ఇరానీ, ముర‌ళీశ‌ర్మ‌, కీర్తి సురేష్‌, అను ఇమాన్యుయేల్‌లు క‌న‌ప‌డ్డారు. మ‌ణికండ‌న్ త‌న సినిమాటోగ్ర‌పీతో ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు. క‌చ్చితంగా ఈ టీజ‌ర్ స‌రికొత్త రికార్డుల‌కు నాంది ప‌లుకుతుంద‌న‌డంలో సందేహం లేదు. సినిమా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత‌.