close
Choose your channels

Airaa Review

Review by IndiaGlitz [ Thursday, March 28, 2019 • తెలుగు ]
Airaa Review
Banner:
KJR Studios
Cast:
Nayanthara, Kalaiyarasan, Yogi Babu
Direction:
Sarjun KM
Production:
Kotapadi J Rajesh
Music:
Sundaramurthy KS

నయ‌న‌తార సినిమా వ‌స్తుంద‌న‌గానే ఓ స్టార్ హీరో సినిమాకు ఎదురుచూసిన‌ట్టు ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. అందులోనూ ఇప్ప‌టిదాకా న‌య‌న‌తార ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌ని మ‌రీ డీ గ్లామ‌ర్ లుక్ పోస్ట‌ర్స్ తో `ఐరా` ఆక‌ట్టుకుంటోంది. న‌య‌న‌తార ఇంత‌కు ముందు `మ‌యూరి` సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేశారు. కానీ అందులో త‌ల్లి పాత్ర‌ను వెన‌క నుంచి చూపించారు. సో ఆమె ఒకేసారి స్క్రీన్ మీద క‌నిపించే స‌న్నివేశాలు ఐరాలోనే ఉన్నాయి. అందుకే తొలిసారి ఇందులోనే ద్విపాత్రాభిన‌యం చేసిన‌ట్టు లెక్క‌. ఇద్ద‌రు న‌య‌న‌తార‌లు ప్రేక్షకుల‌కు క‌నువిందుగా ఉన్నారా?  ఆల‌స్య‌మెందుకు చ‌దివేయండి...

క‌థ‌:

ఒంగోలులో తాటిపాడిలో ఓ బంగ‌ళాలో ఏదో స‌మ‌స్య ఉంద‌ని వెళ్లిన పోలీసుల‌కు అక్క‌డ దెయ్యాలున్నాయ‌నే సంగ‌తి తెలుస్తుంది. మూడు నెల‌లు క్రితం నుండి క‌థ ప్రారంభం అవుతుంది. అక్క‌య్య పాలెంలో ఓ మీడియా కంపెనీలో య‌మున‌(న‌య‌న‌తార‌) మంచి పోజిష‌న్‌లో పనిచేస్తుంటుంది. ఆమెకు పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం ఉండ‌దు. త‌ల్లిదండ్రులు(జ‌య‌ప్ర‌కాష్‌, మీరా కృష్ణ‌న్‌) బ‌లవంతం మీద స‌రేన‌ని అన్నా.. ఇష్టం లేకుండా నాన్న‌మ్మఊరు తాటిపాడుకి వ‌చ్చేస్తుంది. అక్క‌డ మ‌ణి(యోగిబాబు) స‌హ‌కారంతో హార‌ర్ వీడియోస్ చేసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చే్స్తూ ఫేమ‌స్ అవుతుంది. అయితే య‌మున ఉండే ఇంట్లో ఏవ‌రో ఒక‌రు నీడ‌లా తిరుగుతుంటారు. ఆ ఆత్మ ఒక‌రోజు య‌మున నాన‌మ్మ మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతుంది. త‌న‌కు కూడా ఏదో జ‌రుగుతుంద‌ని భావించిన య‌మున త‌న స్వ‌స్థ‌లానికి వెళ్లిపోతుంది. అదే స‌మ‌యంలో అభిన‌వ్‌(క‌లైర‌స‌న్‌) ఎవ‌రితో వెతుక్కుంటూ వెళుతుంటాడు. అత‌ను క‌లుసుకోవాల‌నుకునే వాళ్లంద‌రూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూ ఉంటారు. అయితే వారి మ‌ర‌ణానికి భ‌వానీకి సంబంధం ఉంద‌ని అభిన‌వ్ తెలుసుకుంటాడు. అస‌లు య‌మున‌, భ‌వానికి ఉన్న‌రిలేష‌న్ ఏంటి? యమున‌ని చంపాల‌నుకునే ఆత్మ ఎవరిది?  చివ‌ర‌కు యమున ఎలా బ‌య‌ట‌ప‌డింది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

- న‌య‌న‌తార‌
- బ్యాగ్రౌండ్ స్కోర్‌
- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్‌:

- క‌థ స్లోగా ఉండ‌టం
- సెకండాఫ్ సాగ‌దీత‌గా అనిపించ‌డం
- క్లైమాక్స్‌
- ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌

స‌మీక్ష:

లేడీ సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌తో న‌య‌న‌తార త‌మిళ‌నాట నెంబ‌ర్ వ‌న్‌గా రాణిస్తుంది. ముఖ్యంగా ఈమె న‌టించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు 50 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం విశేషం. దీంతో ఈమె న‌టించిన ఐరా సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అది కూడా న‌య‌న‌తార చేసిన తొలి ద్విపాత్రాభిన‌య చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. ద‌ర్శ‌కుడు స‌ర్జున్ రెండు పాత్ర‌ల‌ను క్రియేట్ చేసి ఒక పాత్ర‌ను గ్లామ‌ర్‌గా.. మ‌రో పాత్ర‌ను డీ గ్లామ‌ర్‌గా చూపించారు. డీ గ్లామ‌ర్‌గా ఉన్న భ‌వాని పాత్ర‌కు పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. ఇక య‌మున పాత్ర భ‌య‌ప‌డ‌టానికే స‌రిపోయేలా చూపెట్టారు. రెండు పాత్ర‌ల్లో వేరియేష‌న్‌ను, ఎమోష‌న్స్‌ను న‌య‌న‌తార చ‌క్క‌గా ప్రెజంట్ చేసింది. న‌య‌న‌తార చుట్టూనే క‌థ తిర‌గ‌డంతో మిగిలిన పాత్ర‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేకుండా పోయింది. యోగిబాబు ఉన్న మేర న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. ఇక కలైర‌స‌న్ పాత్ర‌కు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయించారు. ఇక క‌ల‌ప్పుల్లి లీలా, జ‌య‌ప్ర‌కాష్‌, మీరా కృష్ణ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌లు మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక సర్జున్ ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా మెప్పించ‌లేదు.  హారర్ కాన్సెప్ట్‌తో న‌య‌న‌తార వంటి స్టార్ హీరోయిన్ దొరికిన‌ప్పుడు .. సర్జున్ క‌థ‌, క‌థ‌నం తేలిపోయింది. న‌య‌న‌తార లేకుంటే సినిమా ఆ మాత్రం కూడా ఉండేది కాద‌నిపించింది. ఫ‌స్టాఫ్ అంతా ఇంత‌కు ముందు హార‌ర్ చిత్రాల్లాగానే భ‌య‌ప‌డ‌టానికే స‌రిపోయింది. సీన్స్ స్లోగానే ఉన్నాయి. మూడ న‌మ్మ‌కాలు, బాడీ షేమింగ్ అంశాల‌ను ఆధారంగా చేసుకుని త‌యారు చేసుకున్న క‌థ సాగ‌దీసిన‌ట్లు ఉంది. ఇక సెకండాఫ్ మరీ లాగిన‌ట్లు .. ఎప్పుడు అయిపోతుందా అనిపించేలా ఉంది. ప్ర‌ధాన క‌థ ఇక్క‌డే తిరుగుతుంది. అస‌లు ఆత్మ య‌మున‌ని చంపాల‌నుకునే రీజ‌న్ సిల్లీగా ఉంది. భ‌వాని ఫ్లాష్ బ్యాక్ మ‌రీ లెంగ్తీగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఊసురు మ‌నిపించాడు. మెప్పించాల్సిన సెకండాఫ్ ఢీలా ప‌డింది. సుంద‌ర‌మూర్తి కె.ఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. గ‌త న‌య‌న‌తార చిత్రాల‌తో పోల్చితే ఐరా ఎఫెక్టివ్‌గా అనిపించదు.

బోట‌మ్ లైన్‌:

నయ‌న‌తార అభిమానులైతే ఓసారి చూడొచ్చు. అంతే త‌ప్ప‌.. హార‌ర్ క‌థ‌లో ఉన్న రొటీన్ క‌థే క‌న‌ప‌డుతుంది. మొత్తంగా ఐరా .. ల్యాగ్ రా

Read 'Airaa' Movie Review in English

Rating: 2 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE