close
Choose your channels

విల‌న్‌గా ఐశ్వ‌ర్యారాయ్‌

Thursday, May 16, 2019 • తెలుగు Comments

విల‌న్‌గా ఐశ్వ‌ర్యారాయ్‌

ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఐశ్వ‌ర్యారాయ్‌.. చాలా గ్యాప్ త‌ర్వాత ద‌క్షిణాదిన సినిమా చేయ‌నుంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళం స‌హా బాలీవుడ్‌లో కూడా ప్ర‌ముఖ తార‌లు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ కూడా న‌టిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఐశ్వ‌ర్యారాయ్ నెగ‌టివ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.

రాజ్యాధికారం కోసం కుట్ర‌లు చేసే నందిని అనే పాత్ర‌లో ఐశ్వ‌ర్యారాయ్ క‌న‌ప‌డ‌బోతున్నారని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను ప్రారంభించ‌నున్నారు. టాలీవుడ్ నుండి మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz