ఐశ్వరరాయ్ కు జోడిగా...

  • IndiaGlitz, [Monday,August 21 2017]

సీనియ‌ర్ హీరో మాధ‌వ‌న్ ఇప్పుడు త‌మిళం, బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా మాధ‌వ‌న్ న‌టించిన త‌మిళ చిత్రం విక్ర‌మ్ వేద మంచి విజ‌యాన్ని సాధించింది. మాధ‌వన్ ఇప్పుడు ఫెన్నీ ఖాన్ అనే బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌బోతున్నారు. ఆ చిత్రం పేరు ఫెన్నీ ఖాన్‌. ఈ చిత్రంలో అనిల్‌క‌పూర్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు.

ఓ ప్ర‌ముఖ సింగ‌ర్ పాత్ర‌లో ఐశ్వ‌ర్య న‌టిస్తుండ‌టం విశేషం. ఐశ్వ‌ర్య భ‌ర్త పాత్ర‌లో మాధ‌వ‌న్ తెర‌పై ద‌ర్శ‌న‌మీయ‌నున్నాడు. సాలా ఖ‌ద్దూస్ త‌ర్వాత మాధ‌వ‌న్ చేస్తున్న బాలీవుడ్ చిత్ర‌మిది. అతుల్ ముఖ‌ర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మ‌రి ఐశ్వ‌ర్య పాత్ర‌ను ఇప్పుడున్న సింగ‌ర్స్ ఆధారంగా చేసుకుని డిజైన్ చేశారేమో డైరెక్ట‌ర్‌ చెప్పాల్సిందే.

More News

త్రిష కోపం...

హీరోయిన్ త్రిషకు కోపం వచ్చింది,అది కూడా తన అభిమానులైపైనే,

అరవింద్ స్వామితో నికిషా...

రోజా,బొంబాయి వంటి చిత్రాల్లో మెప్పించిన హీరో అరవిందస్వామి కొన్నాళ్లు పాటు సినిమారంగానికి దూరమయ్యాడు.

ఆయన తో పనిచేయాలనేది కల - కీర్తి సురేష్

సీనియర్ హీరోయిన్ మేక తనయగా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే సినిమాల్లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసింది కీర్తి సురేష్.

మహేష్ సినిమాకు బ్రేక్

సూపర్స్టార్ మహేష్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

కె.సి.ఆర్ జీవిత కథ లో బాలీవుడ్ నటుడు...

తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా,ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు