Aishwarya Rajesh:వల్లి పాత్రపై వ్యాఖ్యలు .. రష్మిక అద్భుత నటి, నా మాటలకు పెడర్ధాలు తీయొద్దు : ఇచ్చిపడేసిన ఐశ్వర్యా రాజేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ అంటే అందాల ఆరబోతకే పరిమితం అనే మాటను చెరిపేసిన నటీమణుల్లో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు. హాట్ షోకు దూరంగా కేవలం కథకే ప్రాధాన్యతనిస్తూ ఆమె దూసుకెళ్తున్నారు. తొలి రోజుల నుంచి నేటి వరకు ప్రయోగాలకు ఐశ్వర్య పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. వివాదాలకు దూరంగా వుండే ఐశ్వర్య లేటేస్ట్‌గా ‘‘ఫర్హానా’’ మూవీలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవల్లి పాత్రను తాను రష్మిక కంటే బాగా చేసేదాన్నని వ్యాఖ్యానించింది. శ్రీవల్లిగా రష్మిక బాగానే చేసిందని.. కానీ తనకు గనుక ఆ పాత్ర వచ్చుంటే ఆమె కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసేదాన్నని ఐశ్వర్య తెలిపింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు రష్మిక అభిమానులకు కోపం తెప్పించడంతో ఐశ్వర్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో ఐశ్వర్య రాజేశ్ స్వయంగా స్పందించారు. తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని చెబుతూ ఓ నోట్‌ను విడుదల చేశారు.
నాకు ఏ క్యారెక్టర్లు సూట్ అవుతాయో చెప్పా :
అందులో ఆమె ఏమన్నారంటే : ‘‘ నాపై చూపిస్తున్న ప్రేమకు, మద్ధతుకు కృతజ్ఞతలు. తెలుగు సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను అడిగారు. నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టమని, తనకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని బదులిచ్చా. ఈ క్రమంలో ఉదాహరణగా.. పుష్పలోని శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చిందని, అలాంటి పాత్రలు తనకు సరిపోతాయని చెప్పా. అయితే దురదృష్టవశాత్తూ నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఆ మూవీలో రష్మిక మందన్న అద్భుతంగా నటించారు. ఆమెను కించపరిచేలా నేను మాట్లాడినట్లు మీడియాలో వస్తోంది.
రష్మిక అంటే ఎనలేని అభిమానం:
ఈ సందర్భంగా ఏర్పడిన గందరగోళాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. పుష్పలో రష్మిక నటనపై నాకు అభిమానమే తప్పించి మరేం లేదు. తోటి నటీనటులపై నాకు అపారమైన గౌరవం వుందని నేను స్పష్టం చేస్తున్నాను. నేను నాకు నచ్చే పాత్రల గురించి వివరించడానికి ప్రయత్నించినప్పుడు తాను చేసిన వ్యాఖ్యలకు హానికరమైన ఉద్దేశ్యాలను ఆపాదించడం మానేయాలని అభ్యర్ధిస్తున్నాను. అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు.. ఇట్లు ప్రేమతో మీ ఐశ్వర్య రాజేశ్’’ అంటూ ఆమె ముగించారు. మరి ఈ స్టేట్మెంట్తోనైనా ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout