'ఐతే' రీబూట్ వెర్షన్ 'ఐతే 2.0/పైరేట్స్‌ 1.0' - దర్శకుడు రాజ్ మాదిరాజ్

  • IndiaGlitz, [Monday,November 16 2015]

ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న సినిమా ఐతే2.0/పైరేట్స్ 1.0'. ఫర్మ్‌ 9 బ్యానర్‌పై రాజ్ మాదిరాజ్ దర్శకత్వం తెరకెక్కుతోంది. కె.విజయరామరాజు, డా.హేమంత్ వల్లపురెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్ లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి ప్రసాద్‌ల్యాబ్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ క్లాప్‌ కొట్టగా, టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిలించాంబర్‌ ప్రెసిడెంట్‌ రామ్మోహన్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో జూపూడి ప్రభాకర్‌రావు, బసిరెడ్డి, రామ్మోహన్‌, వేణుగోపాల్‌, రాజ్‌ మాదిరాజ్‌, నిర్మాతలు కె.విజయరామరాజు, డా॥హేమంత్‌ వల్లపురెడ్డితో సహా చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

దర్శకుడు రాజ్‌ మాదిరాజ్‌ మాట్లాడుతూ 'ఐతే 2.0'సినిమా ఈరోజు నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. సినిమాను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే సింగిల్‌ షెడ్యూల్‌లో 4.'45రోజుల్లో పూర్తి చేస్తాం. తర్వాత విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఐతే' సినిమా విడుదలై దాదాపు పన్నెండేళ్ళవుతోంది. చంద్రశేఖర్‌ యేలేటి, గుణ్ణం గంగరాజుగారు సైలైంట్‌గా ఒక సినిమాను ఎలా చేయవచ్చో చూపించారు. ఆ సినిమా అవార్డులతో పాటు చాలా మంది మెప్పించింది. అదే టైటిల్తో సినిమా చేస్తానని గుణ్ణం గంగరాజుగారిని అడిగితే ఆయన ఒప్పుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు రాని టెక్నో థ్రిల్లర్ జోనర్‌లో ఐతే 2.0 తెరకెక్కనుంది అలాగు ఈ వెర్షన్ ఐతే' సినిమాకు ఈ సినిమా రీబూట్‌ వెర్షన్‌ లా ఉంటుంది. కానీ అంత సైలెంట్‌గా ఉండదు. టెక్నాలజీ వల్ల మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ కొందరు తమ చేతుల్లో ఉంచుకుని మనతో ఆటలాడుకుంటున్నారనే సంగతిని మనం మరచిపోతున్నాం. వాటి పరిణామాలేంటి అనే విషయాన్నే ఈ చిత్రంలో చూపించబోతున్నాం. తెలుగులో ఐతే2.0'గా, హిందీలో పైరేట్స్‌1.0'గా ఈ సినిమా రూపొందనుంది'' అన్నారు.

నిర్మాత కె.విజయరామరాజు మాట్లాడుతూ దర్శకుడు రాజ్‌ మాదిరాజుగారు సినిమాను డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాను తెలుగు, హిందీలో నిర్మిస్తున్నాం. మంచి టీమ్‌ కుదిరింది'' అన్నారు.

బసిరెడ్డి మాట్లాడుతూ దర్శకుడు రాజ్‌మాదిరాజ్‌, నిర్మాతలు పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. ఈరోజుల్లో హిందీ, తెలుగులో ఒకే సమయంలో సినిమా చేయడమంటే అంత ఈజీ కాదు. కానీ వారి ప్రణాళికకు తగిన విధంగా సినిమా మంచి విజయాన్ని సాధించాలి. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ నిర్మాత విజయరామరాజుకు మార్కెటింగ్‌లో మంచి అనుభవం ఉంది. అదే అనుభవంతో సినిమా రంగంలో కూడా తప్పకుండా సక్సెస్‌ సాధిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పటి టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగముందో, అంతే నష్టముందని తెలియజేసే పాయింట్‌తో తెరకెక్కుతుంది. యూత్‌ను సరైన దారిలో ఎలా పెట్టాలి, ఎలా సోసైటీకి మేలు చేయాలనే విషయాన్ని కూడా ఇందులో చూపించనున్నారు. యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొని అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి,డా॥శ్రీకాంత్‌, జీవా తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, సంగీతం: అరుణ్‌ చిలువేరు, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, ఎడిటింగ్‌: శశాంక్‌ మాలి, డ్యాన్స్‌: చంద్రకిరణ్‌, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగాడ, ప్రొడక్షన్‌ డిజైన్‌: మహేష్‌ చదలవాడ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: కళ్యాణం మురళి, నిర్మాతలు: కె.విజయరామరాజు, డా॥హేమంత్‌ వల్లపురెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌ మాదిరాజు.

More News

నిర్ణ‌యం మార్చుకున్న ధ‌నుష్‌..

తమిళ హీరో ధ‌నుష్‌..ఓ ప‌క్క వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తూనే...మ‌రో ప‌క్క మంచి చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు.

మ‌రో రెఢీ చేస్తున్నారు..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పండ‌గ చేస్కో మూవీతో విజ‌యం సాధించినా...శివ‌మ్ తో ప్లాప్ చూడాల్సి వ‌చ్చింది.

కుమారి 21 ఎఫ్ సెన్సార్ రిపోర్ట్..

డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా మారి చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, హేబా ప‌టేల్ జంట‌గా న‌టించారు.

చిరు గురంచి వ‌ర్మ అలా రాసాడా..

సంచ‌ల‌నానికి మ‌రో పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడూ వార్ల‌ల్లో ఉండే వ‌ర్మ తాజాగా గ‌న్స్ అండ్ థైస్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే టైటిల్ తో త‌న జీవిత చ‌రిత్ర రాస్తున్నారు.

మ‌రో త‌మిళ మూవీ రైట్స్ తీసుకున్న చ‌ర‌ణ్‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా చ‌ర‌ణ్‌ మ‌రో త‌మిళ మూవీ 49 - ఓ రీమేక్ రైట్స్ తీసుకున్న‌ట్టు స‌మాచారం.