'RRR' లో అజయ్ దేవగణ్ పాత్ర ఇదే ?

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'RRR'. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు హీరోలుగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో.. అంచ‌నాల‌తో దాదాపు రూ.350 కోట్ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ కూడా న‌టిస్తున్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ట‌.

వివ‌రాల ప్ర‌కారం ఈ పాత్ర సినిమాలో చాలా కీల‌క‌మైన స‌మ‌యంలో ఎంట్రీ ఇస్తుంద‌ట‌. ఈ పాత్ర తార‌క్, చ‌ర‌ణ్ పాత్ర‌ల‌ను ఇన్‌స్పైర్ చేస్తూ మెంట‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ట‌. రాజ‌మౌళి నెరేట్ చేయ‌గానే, అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి పాత్ర న‌చ్చ‌డంతో చేయ‌డానికి వెంట‌నే ఓకే చేశాడ‌ట‌.

ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తుంటే.. తార‌క్ తెలంగాణ యోధుడు కొమురం భీమ్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూలై 30న సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. కానీ.. మ‌రో ప‌క్క సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.