మరాఠా వీరుడి పాత్రలో అజయ్ దేవగణ్

  • IndiaGlitz, [Friday,July 21 2017]

హిస్టారిక‌ల్ కాన్సెప్ట్ సినిమాలు ట్రెండ్ కొన‌సాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో ప‌ద్మావ‌తి సినిమా ఇప్పుడు తెర‌కెక్కుతోంది. దీంతో పాటు అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తానాజీ' సినిమా కూడా తెర‌కెక్కుతోంది. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మ‌హారాష్ట్ర‌కు చెందిన మ‌రాఠా వీరుడు సుబేదార్‌ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను అజయ్ దేవ‌గ‌ణ్ త‌న ట్విటర్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేశారు. . తానాజీ మ‌లుస‌రే, ప్రజలు, తన నేల తల్లి, తన రాజు ఛత్రపతి శివాజీ కోసం పోరాడారు. అద్భుతమైన భారత చరిత్రలో కీర్తించని యుద్ధవీరుడు అంటూ అజ‌య్ దేవ‌గ‌ణ్ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

More News

బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ బీచ్ ఫెస్టివల్ సాంగ్

ఇప్పటికే విడుదలైన టీజర్-పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "జయ జానకి నాయక" ఖాతాలో మరో విశేషం చేరింది. ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపంలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించింది చిత్ర బృందం.

సంజన గుట్టు విప్పింది

దండుపాళ్యం 2లో సంజన వివస్త్రగా నటించిందనే వార్తలు, కొన్ని ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కనిపిస్తున్నాయి. అవేమీ తనకు సంబంధించినవి కావని చెప్పింది సంజన.

'వీఐపీ2' వాయిదా పడింది..!

ధనుష్ హీరోగా నటించిన `వీఐపీ2` విడుదల వాయిదా పడింది. అమలాపాల్ హీరోయిన్గా నటించిన సినిమా ఇది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు.

'యువర్స్ లవింగ్లీ' మోషన్ పోస్టర్ రిలీజ్

యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ".

వేశ్య పాత్రలో రజనీకాంత్ హీరోయిన్

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `కాలా`. ఈ చిత్రంలో ముంబై హీరోయిన్ హ్యుమా ఖురేషి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.