close
Choose your channels

`RRR` టీమ్‌తో జ‌త క‌ట్టిన బాలీవుడ్ స్టార్‌

Tuesday, January 21, 2020 • తెలుగు Comments

`RRR` టీమ్‌తో జ‌త క‌ట్టిన బాలీవుడ్ స్టార్‌

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

అలాగే తెలంగాణ విప్ల‌వ‌వీరుడు కొమురం భీమ్‌గా తార‌క్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా బ‌ట్ కీల‌క పాత్ర‌ల్లోన‌టిస్తార‌నే సంగ‌తి కూడా తెలిసిందే. తాజాగా ఈ సినిమా యూనిట్‌తో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేసిన చిత్ర యూనిట్.. రాజ‌మౌళి, అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌లుసుకున్న ఫొటోల‌ను విడుద‌ల చేసింది. అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆస‌క్తి అందరరిలో నెల‌కొంది.

ఈ చిత్రంలో ఇంకా స‌ముద్ర‌ఖ‌ని స‌హా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడ్‌, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ ఏడాది జూలై 30న సినిమాను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీపై ఎలాంటి ప్ర‌క‌టన ఇవ్వలేదు. దీంతో సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌వుతుందంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz