'హ‌లో'.. అజ‌య్ ఫ‌స్ట్‌లుక్‌

  • IndiaGlitz, [Friday,November 24 2017]

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా, స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా, హీరోగా.. ఇలా అన్ని కోణాల్లోనూ త‌న న‌ట‌న‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు న‌టుడు అజ‌య్‌. అలాంటి అజ‌య్‌కి మంచి పాత్ర‌లు ఇచ్చి ప్రోత్స‌హించ‌డంలో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ముందుంటారు. ఆయ‌న రూపొందించిన ఇష్క్ చిత్రంతో పాటు 24 చిత్రంలోనూ అజ‌య్ క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించి మంచి మార్కులు కొట్టేశారు.

ఇప్పుడు విక్ర‌మ్ తాజా చిత్రం హ‌లో లోనూ అజ‌య్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో రిషి అనే పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్నాడు. కాగా, దీనికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ ఇవాళ చిత్ర బృందం విడుద‌ల చేసింది.

చూస్తుంటే.. ఇష్క్ త‌ర‌హాలో ఇందులోనూ నెగెటివ్ రోల్‌లో అజ‌య్ సంద‌డి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అఖిల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 22న విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

న‌య‌న్ స్పెష‌ల్‌

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ త‌మిళంలో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా రాణించ‌డ‌మే కాకుండా.. కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది.

'వైశాఖం' మంచి సినిమాగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తిగా వుంది - జయ బి

ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌) - అక్కినేని 2017 సినీ, టీవి అవార్డుల ప్రదానోత్సవం మరియు ఫాస్‌ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నవంబర్‌ 23న హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో చిత్ర ప్రముఖులు, ఆహుతుల మధ్య ఘనంగా జరిగింది.

2 కంట్రీస్ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

సునీల్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 2 కంట్రీస్ టీజ‌ర్‌ను నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌టం ఆనందంగా ఉంది.  మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలనిపించేలా టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజ‌ర్‌లాగానే సినిమా ఉంటుంద‌ని ఆశిస్తూ చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

సప్తగిరి ఇంత బాగా డ్యాన్స్‌లు చేస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు - సాయిధరమ్‌ తేజ్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బాబీ డైరెక్షన్ లో సాయిధరమ్‌ తేజ్?

'జైలవకుశ' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర (బాబీ). తన మొదటి సినిమా 'పవర్'తో తొలి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. రెండో చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌తో మాత్రం ప‌రాజ‌యం చ‌విచూశారు.