అజిత్ మూవీ రిలీజ్ డేట్‌...

  • IndiaGlitz, [Tuesday,March 26 2019]

తమిళ అగ్ర కథానాయకుల్లో ఒక‌రైన అజిత్ కీలక పాత్రలో బోనీ కపూర్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, తాప్సీ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన హిందీ చిత్రం 'పింక్'కు ఇది రీమేక్.

'ఖాకి' దర్శకుడు హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అమితాబ్ పాత్రను తమిళంలో అజిత్ పోషిస్తున్నారు. కన్నడ 'యూ టర్న్' చిత్రంలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్, తర్వాత 'విక్రమ్ వేద' సహా కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది.

ఇప్పుడు తెలుగులో నానితో 'జెర్సీ'లో నటిస్తుంది. ఈమె బాలీవుడ్‌లో తాప్సీ పాత్ర‌లో న‌టిస్తుంది. అజిత్ న‌టిస్తోన్న 59వ సినిమా ఇది. ఈ చిత్రానికి నేర్‌కొండ 'పార్వై'(నేరుగా చూడ‌టం) అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది ఆగ‌స్ట్ 10న విడుద‌ల చేయ‌బోతున్నారు.