హైద‌రాబాద్‌కు అజిత్‌

  • IndiaGlitz, [Wednesday,September 21 2016]

తమిళ స్టార్ హీరోస్‌లో అజిత్ ఒక‌రు. తమిళంతో పాటు తెలుగు మార్కెట్ పై కూడా అజిత్ దృష్టి సారిస్తున్నాడు. అందుకే అజిత్ సినిమాల‌ను హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లో చిత్రీక‌ర‌ణ చేస్తుంటారు. వీరుడొక్క‌డే, వేదాళం సినిమాల‌ను కూడా ఇక్క‌డ చిత్రీకరించారు.

తాజాగా ఇప్పుడు ద‌ర్శ‌కుడు శివ‌, అజిత్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ ప్ర‌స్తుతం యూర‌ప్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌డానికి యూనిట్ వ‌ర్గాలు రెడీ అయిపోయాయి. అజిత్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.