23 ఏళ్ల బంధం ముగిసింది.. ఎన్డీయేకు శిరోమనీ అకాలీదళ్ గుడ్ బై..

  • IndiaGlitz, [Sunday,September 27 2020]

సుదీర్ఘ ప్రయాణం.. అర్థంతరంగా ముగిసింది. ఎన్డీఏ, శిరోమనీ అకాలీదళ్‌ల మధ్య వ్యవసాయ బిల్లులు చిచ్చు పెట్టాయి. దీంతో 23 ఏళ్ల రాజకీయ బంధాన్ని శిరోమనీ అకాలీదళ్ తెంచేసుకుంది. శనివారం పార్టీ ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం దాదాపు మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలోనే అకాలీదళ్ పెద్దలంతా కలిసి జేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు.

కేంద్రం తీసుకొచ్చిన బిల్లుల ప్రభావం రైతులపై తీవ్రంగా పడిందని... కేవలం రైతులే కాదు... వ్యవసాయంపై ఆధారపడే దళితులు, రైతు కూలీలు.. అందరిపై ప్రభావం పడిందని... అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ తీసుకొచ్చిన బిల్లులు రైతులకు ప్రాణాంతకమే కాకుండా వినాశకరమైనవని పేర్కొన్నారు. ఈ వ్యవసాయ బిల్లులను తాము సభలో సైతం వ్యతిరేకించామన్నారు. ఈ బిల్లులు నేరుగా రైతులకు, రైతు కూలీలకు నష్టం చేస్తాయని పేర్కొన్నారు. తమ అభిప్రాయాలకు బీజేపీ విలువనివ్వలేదని అయినప్పటికీ కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామని అయినా వినడం లేదని బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు తమ పంటను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించిందని బాదల్ పేర్కొన్నారు. జమ్మూలో పంజాబీని రెండో అధికార భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలను నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుంచి బయటకి రావాలి నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు పంజాబ్ ప్రజానీకంతో పాటు.. పార్టీ కార్యకర్తలు, రైతులు, ట్రేడర్స్ అందరితో చర్చించామని వెల్లడించారు. తమ పార్టీ మూల సిద్ధాంతాలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు.

More News

సిగ్గో సిగ్గు.. బాలు అంత్యక్రియలకు మొహం చాటేసిన టాలీవుడ్!

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం పరమపదించారు. బాలు అంత్యక్రియలు చెన్నై శివారులోని ఫామ్ ‌హౌస్‌లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు.

రకుల్‌‌ను డ్రగ్స్ కేసు నుంచి కాపాడేందుకు యత్నిస్తున్న తెలంగాణ పెద్దలెవరు?

డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోందో లేదో కానీ.. టాలీవుడ్‌లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ రంగు పులుముకుని సంచలనంగా మారుతోంది.

ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసిన కేసీఆర్

ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.

నాగ్ మెడల్స్.. గంగవ్వకు మహానటి.. అవినాష్‌కు కంత్రి

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యానికి గ్రేట్ ట్రిబ్యూట్ అర్పించిన అనంతరం షో స్టార్ట్ అయింది. శుక్రవారం జరిగింది చూసిన అనంతరం నాగ్..

బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి డీకే అరుణ, పురందేశ్వరి..

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని జేపీ నడ్డా ప్రకటించారు. జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇరువురు మహిళా నేతలు స్థానం దక్కించుకోవడం విశేషం.