సామాన్యుడి శక్తిని చాటే 'ఆకాశం నీ హద్దురా'

  • IndiaGlitz, [Monday,October 26 2020]

ఆవేశం అందరికీ ఉంటుంది.. కానీ ఆలోచనతో ముందుకు సాగడం కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఆవేశం, ఆలోచన కలిస్తే ఏమవుతుంది. అద్భుతాలు జరుగుతాయి. దీనికి ఉదాహరణ ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథన్‌ జీవిత చరిత్ర. గోపీనాథన్‌ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రాసిన పుస్తకం 'సింప్లి ఫై'కు కల్పిత వెర్షన్‌గా  తెరకెక్కిన సినిమాయే 'శూరరై పోట్రు'. దీన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదల చేస్తున్నారు. ఓటీటీ మాధ్యమంలో నవంబర్‌ 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. గురు(ఇరండాం సుట్రు) ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య, రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తి నిర్మించారు.

 ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. హృదయానికి హత్తుకుంది. నిజంగా నిన్ను నమ్మి పనిలో అంకితమైతే ప్రపంచంలో ఏదీ నీకలలను నిరోధించకుండా ఆపలేదు అని చెప్పే ప్రయత్నాన్ని ఈ చిత్రంలో చేశాం అన్నారు హీరో, నిర్మాత సూర్య. అపర్ల బాల మురళి హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌ విలక్షణ నటుడు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. కరోనా కారణంగా థియేటర్స్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సూర్య ఈ చిత్రాన్ని డిజిటల్ మాధ్యమంలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఓటీటీలో అక్టోబర్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది.

More News

వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం !

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

ఇవాళ అక్కినేని వారి కోడలు సమంత షోని హోస్ట్ చేసింది. ఫస్ట్ టైమ్ చేసినప్పటికీ హౌస్‌మేట్స్‌ని ఓ ఆటాడేసుకుంది.

హిమాలయాల్లో నాగ్.. ట్విట్టర్ వేదికగా చెప్పిన విక్కీ కౌశల్..

వీకెండ్ వచ్చిందంటేనే బిగ్‌బాస్ షోకి చాలా హైప్ క్రియేట్ అవుతుంది. దానికి కారణం హోస్ట్ నాగార్జున.

ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించనున్న కె.రాఘవేంద్రరావు..

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నటుడి అవతారమెత్తబోతున్నారు. కొత్త మూవీలో లీడ్ రోల్ పోషించేందుకు సర్వం సిద్ధమైంది.

సమంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఏడిపించబోతోంది..

బిగ్‌బాస్ సీజన్ 4. వీకెండ్‌కి సమంత రాబోతోంది. ఈ రోజు షో మొత్తం ఆమెదే. ఇవాళ ప్రోమోను స్టార్ మా యాజమాన్యం విడుదల చేసింది.