close
Choose your channels

అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ...?

Saturday, August 25, 2018 • తెలుగు Comments

అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ...?

అఖిల్‌, హ‌లో చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ విన‌ప‌డుతుంది. కాగా ఈ సినిమా త‌ర్వాత అఖిల్‌.. స‌త్య‌ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తారు.

అయితే ఈ సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో నిర్మిస్తార‌ట‌. అది కూడా బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌. ఇలా నాలుగో సినిమాకే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం అనేది ఆనందించ‌ద‌గ్గ‌దే. అది కూడా క‌ర‌ణ్ జోహార్‌లాంటి వ్య‌క్తి ప‌రిచ‌యం చేస్తున్నాడంటే అఖిల్‌కు బాలీవుడ్‌లో ఓపెన్ ఎంట్రీ గ్రాండ్‌గానే ఉంటుంద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.