close
Choose your channels

బాల‌య్య‌తో బ్యూటీతో అఖిల్‌?

Monday, July 9, 2018 • తెలుగు Comments

బాల‌య్య‌తో బ్యూటీతో అఖిల్‌?

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు తెలుగు సినిమా పెట్టింది పేరు. ఈ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్.. స్పెష‌ల్ సాంగ్స్‌ ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటాయి. ప్ర‌స్తుతం ట్రెండ్ మారి కొత్త‌ద‌నం ఉన్న సినిమాలు వ‌స్తున్నా కూడా స్పెష‌ల్ సాంగ్‌ల‌కు ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు.

అస‌లు విష‌య‌మేమంటే..'తొలిప్రేమ' వంటి సెన్సిబుల్ ల‌వ్‌స్టోరీని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.. త‌దుప‌రి చిత్రంగా అఖిల్ అక్కినేనితో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో చేస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా లండ‌న్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

ఈ చిత్రంలో వెంకీ అట్లూరి ఓ స్పెష‌ల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడు?  ఇందులో ఫ‌రా క‌రిమీ న‌ర్తించ‌నుంది. గ‌తంలో బాల‌కృష్ణ‌తో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, తిక్క సినిమాల్లో ఈ అమ్మ‌డు న‌టించింది. నిధి అగ‌ర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేసేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.