close
Choose your channels

సమంత పోస్టుపై అఖిల్ కామెంట్

Monday, November 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సమంత పోస్టుపై అఖిల్ కామెంట్

అక్కినేని వారి కోడలు సమంత ఓ ఫోటోని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఆ పోస్టుపై ఆమె మరిది.. హీరో అఖిల్ స్పందించాడు. సోమవారం అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి చైతు మాల్దీవులకు వెళ్లాడు. బర్త్‌డే వెకేషన్‌ను నాగ చైతన్య, సామ్ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా సామ్ అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

మాల్దీవుల్లో సమంత స్కూబా డైవింగ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి  `మొత్తానికి సాధించా.. సముద్రంలో డైవ్ చేశా..` అంటూ కామెంట్ చేసింది. ఈ ఫోటో చూసిన అఖిల్ `వావ్.. ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకపోతున్నా` అంటూ కామెంట్ చేశాడు. ఇక సామ్ ఫోటోపై అభిమానులు సైతం విరివిగా స్పందిస్తున్నారు. 12.54 లక్షలకు పైగా అభిమానులు లైక్ చేయగా.. వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.