ఇంకెన్ని స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తాడో

  • IndiaGlitz, [Monday,November 27 2017]

'హలో' సినిమాతో అఖిల్.. ప్రేక్షకులకు రోజుకొక సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ముందు టీజర్, ట్రైలర్లతో అలరించాడు. తర్వాత త‌ను చేసే పాత్ర అంటూ అవినాష్‌గా ప‌ల‌క‌రించాడు. అమ్మ నాన్న అంటూ రమ్యకృష్ణ, జగపతి బాబులను పరిచయం చేస్తూ ఒక పిక్ ని రిలీజ్ చేసాడు.

ఆ నెక్ట్స్‌.. రిషిగా అజయ్ ని పరిచయం చేస్తూ ఒక పిక్ ని ట్విట్టర్ లో పెట్టాడు. ఇవ‌న్నీ అభిమానుల‌ను అల‌రించాయి. సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున, అమల, సమంతలు కూడా తళుక్కుమని మెరవబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ట్రైలర్ లో చూపించిన యాక్షన్ సీక్వెన్సెస్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అఖిల్‌.. రిలీజ్ అయ్యే టైంకి ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తాడో చూడాలి.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌, న‌టి లిజీల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ‌లో.. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతోంది.

More News

పాట పుట్టిన చోటే 'రచయిత' గీతావిష్కరణ

దుహర మూవీస్ సమర్పించు చిత్రం "రచయిత". ఈ చిత్ర ఆడియో విడుదల సోమవారం  హైదరాబాద్ మణికొండ లోని పాటల రచయిత చంద్రబోస్ నివాసం లో నటుడు జగపతిబాబు సమక్షంలో చంద్ర బోస్ పాడి వినిపించడం తో ఈ  ఆడియా విడుదల జరిగింది.

జ్యోతికి, బాలాపై కేసు...

సీనియర్ హీరోయిన్..హీరో సూర్య భార్య అయిన జ్యోతిక ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్గా నటించిన `మగళూర్ మట్టుమ్` తర్వాత.. బాల దర్శకత్వంలో `నాచియార్` సినిమా చేస్తుంది.

అజిత్ స‌ర‌స‌న..?

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు 'విశ్వాసం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీరం, వేదాళం, వివేకం సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా.

సినిమాల్లోకి మ‌హేష్ మేన‌ల్లుడు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు మేన‌ల్లుడు..తెలుగు దేశం పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ సినీ రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు.

సూర్య 'గ్యాంగ్'?

హీరో సూర్య‌, విఘ్నేష్ శివ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం తానా సెంద కూట్ట‌మ్‌. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు.