అన్నయ్య చైతు సెంటిమెంట్ అఖిల్ కి కలిసొస్తుందా..?

  • IndiaGlitz, [Friday,November 25 2016]

అఖిల్ త‌న రెండో చిత్రాన్ని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 12న ఈ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. నాగ‌చైత‌న్య మొద‌టి చిత్రం జోష్‌. ఈ చిత్రం ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.
ఆత‌ర్వాత చైత‌న్య రెండో సినిమా ఏమాయ‌చేసావే సినిమాతో ఘ‌న విజ‌యం సాధించాడు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించారు. స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కూడా త‌న రెండో సినిమాకి ఎ.ఆర్.రెహ‌మాన్ నే మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంచుకున్నాడు. చైత‌న్య‌, అఖిల్....ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రి రెండో సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ కావ‌డం విశేషం. ఎ.ఆర్.రెహ‌మాన్ మ్యూజిక్ చైత‌న్య‌కు వ‌ర్కవుట్ అయిన‌ట్టే...అఖిల్ కు కూడా వ‌ర్క‌వుట్ అయి స‌క్సెస్ అందిస్తుంద‌ని ఆశిద్దాం..!

More News

గోపీచంద్ - సంపత్ నంది ల చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి..!

మాస్ స్టార్ గోపీచంద్, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్లో, శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె భగవాన్, జె పుల్లారావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

మెట్రో మూవీ సాంగ్ లో గీతామాధురి

టాలీవుడ్ క్రేజీ సింగర్ గీతామాధురి త్వరలో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైనమిక్ సింగర్ నటించే ఆ సినిమా ఏది? అన్న ఆసక్తి కనబరిచారంతా. ఏదైతేనేం గీతామాధురి నటించిన సినిమా డీటెయిల్స్ వచ్చేశాయి.

హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన నిఖిల్..!

విభిన్న కథా చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తున్నయువ కథానాయకుడు నిఖిల్.

11 ఏళ్ల తర్వాత ప్రభుదేవా చేస్తున్నాడా..!

అభినేత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా

నాగ్ రాజు గారి గది 2 డీటైల్స్..!

నవరస సమ్రాట్ నాగార్జున ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు.