అక్కినేని వారి డబుల్ ట్రీట్

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంట‌గా తెరకెక్కిన చిత్రం హలో'. నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వ‌రాలు అందించారు. రేపు వైజాగ్‌లో ఈ సినిమా ఆడియో వేడుక జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అక్కినేని కుటుంబ స‌భ్యులు అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్నారు.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. గత సంవత్సరం వైజాగ్ జగదాంబ సెంటర్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ని తమ చేతుల మీదుగా ప్రారంభించారు సమంత, అఖిల్. రేపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా అక్కినేని కుటుంబం ఈ షాపింగ్ మాల్ లో మధ్యాహ్నం 12గం.ల నుంచి సందడి చేయనున్నారు. అలాగే సాయంత్రం ఎం.జి.ఎం.గ్రౌండ్స్ లో హలో' సినిమా ఆడియో లాంచింగ్ ఫంక్షన్ ని కూడా నిర్వహించబోతున్నారు.

ఈ వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ నాగ్ ట్విట్ట‌ర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అలాగే “హలో వైజాగ్.. రేపు కలుద్దాం” అని ట్వీట్ కూడా చేసారు నాగ్. ఈ కార్యక్రమంలో అఖిల్ తన ఫాన్స్ కి మరొక సర్ ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. త‌న ఆట, పాటలతో అఖిల్ అభిమానుల‌ని అలరించబోతున్నారు.

ఈ విష‌యాన్ని నాగ్ ఇప్ప‌టికే ఇటీవ‌ల జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.