close
Choose your channels

కుమారి ద‌ర్శ‌కుడితో అక్కినేని హీరో...

Sunday, August 5, 2018 • తెలుగు Comments

కుమారి ద‌ర్శ‌కుడితో అక్కినేని హీరో...

అక్కినేని అఖిల్ ఇప్పుడు సినిమాలు చేయ‌డంలో స్పీడు పెంచాడు. ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న అఖిల్ త‌దుప‌రి సినిమా కోసం వ‌రుస క‌థ‌లు వింటున్నాడు. రీసెంట్‌గా మ‌లుపు ద‌ర్శ‌కుడు స‌త్య ప్ర‌భాస్ చెప్పిన క‌థ‌ను డెవ‌లప్ చేయ‌మ‌ని చెప్పిన అఖిల్ ఇప్పుడు సుకుమార్ టీమ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే అంతా సుకుమారే చేసుకుంటున్నాడు. సూర్య ప్ర‌తాప్ సినిమాను డైరెక్ట్ చేస్తాడు. సుకుమార్ రైటింగ్స్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తాయి. ప్ర‌స్తుతం రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టిన అఖిల్ ఏ సినిమా చేస్తాడ‌నేది త్వ‌ర‌లోనే తెలిసిపోతుంది.